Scotland Wicketkeeper : క్రికెట్ అంటే కాలేజీ స్టూడెంట్స్ నుంచి క్యాంపస్ కుర్రాళ్లకు ఎంతిష్టమో తెలిసిందే. అయితే.. కొందరికి వయసుపై బడినా కూడా ఆటపై ప్రేమ ఇసుమంతైనా తగ్గదు. స్కాట్లాండ్(Scotland )కు చెందిన ఈయనకు కూడా క్రికెట్ అంటే మస్త్ ఇష్టం. వయసులో ఉన్నప్పుడు వికెట్ కీపర్‌గా ఆడిన ఆయన మళ్లీ మైదానంలోకి దిగాడు. అది కూడా 82 ఏళ్ల వయసులో. అంతకంటే షాక్‌కు గురి చేసే విషయం ఏంటంటే..? ఆయన ఆక్సిజన్ సిలిండర్(Oxygen Cylinder) సాయంతో శ్వాస తీసుకుంటూ క్రికెట్ ఆడాడు.
ఇంతకు ఆ పెద్దాయన పేరేంటో తెలుసా..? అలెక్స్ స్టీలే(Alex Steele). అనారోగ్యంతో బాధ పడుతున్న అలెక్స్ ఈమధ్యే ఫొర్ఫర్షైర్ క్లబ్(Forfarshire Cricket Club) తరఫున మ్యాచ్ ఆడాడు. వీపున ఆక్సిజన్ సిలిండర్ తగిలించుకొని కీపింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు ‘క్రికెట్ నిజంగా అద్భుతమైన ఆట. 30 ఓవర్ల పాటు కీపింగ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అలెక్స్ తెలిపాడు. ప్రస్తుతం అతడి వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
అసలు అలెస్స్కు ఏమైందో తెలుసా..? 2020లో అలెక్స్ అభిమానులతో గుండె పగిలే వార్త పంచుకున్నాడు. తనకు ఇడియోపాథిక్ పల్మొనరీ ఫైబ్రోసిస్(Idiopathic Pulmonary Fibrosis) అనే ప్రాణాంతకమైన శ్వాస సంబంధ (Terminal Respiratory Illness) సమస్య ఉందని, తాను మరో ఏడాది కంటే ఎక్కువ బతకనని చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా.. ఆయన ఎందుకు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకున్నాడో. అలెక్స్ 1967లో స్కాట్లాండ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత పదేళ్లకు మళ్లీ ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో జట్టులోకి వచ్చాడు. అయితే.. మూడేళ్లలో ఐదు మ్యాచ్‌లు ఆడాడంతే. ఓపెనింగ్ బ్యాటర్ అయిన అలెక్స్ 14 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 621 రన్స్ కొట్టాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ ఎంతో తెలుసా..? 97. 3 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు.