Babar Azam | టీ20ల్లో పాక్ కెప్టెన్ సంచలనం.. విండీస్ లెజెండ్ సరసన బాబర్
Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం(Babar Azam) అరుదైన ఫీట్ సాధించాడు. లంక ప్రీమియర్ లీగ్(Lanka Premier League)లో తొలి సెంచరీ కొట్టిన అతను టీ20ల్లో పదో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, పొట్టి క్రికెట్లో 10కి పైగా సెంచరీలు బాదిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్(Chris Gayle) రికార్డు....
Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం(Babar Azam) అరుదైన ఫీట్ సాధించాడు. లంక ప్రీమియర్ లీగ్(Lanka Premier League)లో తొలి సెంచరీ కొట్టిన అతను టీ20ల్లో పదో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, పొట్టి క్రికెట్లో 10కి పైగా సెంచరీలు బాదిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్(Chris Gayle) రికార్డు సమం చేశాడు. అయితే.. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీల రికార్డు మాత్రం గేల్ పేరిటే ఉంది.
కొలంబో స్ట్రయికర్స్(Colombo Strikers) జట్టు తరఫున ఆడుతున్న బాబర్ సెంచరీతో కదం తొక్కాడు.ఈరోజు గాలే టైటాన్స్(Galle Titans)తో జరిగిన మ్యాచ్‌లో అతను 59 బంతుల్లోనే 104 పరుగులు సాధించాడు. దాంతో, 183 పరుగుల లక్ష్య ఛేదనలో కొలంబో జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
బాబర్, క్రిస్ గేల్

పొట్టి ఫార్మాట్లో బాబర్‌కు గొప్ప రికార్డు ఉంది. ఈ స్టార్ ఆటగాడు 52 ఇన్నింగ్స్‌లోనే 2వేల పరుగులు కొట్టాడు. అంతేకాదు ఒక వరల్డ్ కప్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు, 303 పరుగులతో మరో రికార్డు నెలకొల్పాడు. నిరుడు బాబర్ సారథ్యంలోని పాక్ ఫైనల్ చేరింది. అయితే.. ఇంగ్లండ్ జట్టు చేతిలో అనూహ్యంగా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
And it’s Babar, once again!
Striker#LPL2023 #LiveTheAction pic.twitter.com/9AFBKPi4oc— LPL – Lanka Premier League (@LPLT20) August 7, 2023
ఐదో స్థానంలో కోహ్లీ
ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో ఎక్కువ శతకాలు కొట్టింది ఎవరో తెలుసా..? విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్. అతను 22 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ 10 సెంచరీతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మైకేల్ క్లింగర్(Michael Klinger), డాషింగ్ డేవిడ్ వార్నర్(David Warner) 8 శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli) 8 సెంచరీలతో ఐదో స్థానంలో నిలిచాడు.
ఇవి కూడా చదవండి
Chaminda Vaas | బోర్డులు ఆ ఒక్కటి చేస్తే చాలు.. క్రికెటర్లు ఫ్రాంచైజీలకు ఆడరు : శ్రీలంక దిగ్గజం
Inzamam-ul-Haq | పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్‌గా ఇంజమామ్.. అతను ఈ పదవి చేపట్టడం ఎన్నోసారంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

