హైదరాబాద్, ఆట ప్రతినిధి: పుణె(మహారాష్ట్ర) వేదికగా జరిగిన 5వ జాతీయ పారా షూటింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన రాయల శ్రీధర్ కాంస్య పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన మిక్స్డ్ 10మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్(ఎస్హెచ్2) వ్యక్తిగత ఫైనల్లో శ్రీధర్ 226.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
కుష్బు(యూపీ, 249.1), సిమ్రాన్శర్మ(హర్యానా, 248.6) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.