కాజీపేట, జనవరి 13 : హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో జరుగుతున్న 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో చాంపియన్ షిప్ 2025-26 పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రైల్వేస్, మహారాష్ట్ర టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాయి. మహిళల లీగ్ మ్యాచ్‌లో డిపెండింగ్ చాంపియన్ మహారాష్ట్ర 44-10తో ఉత్తరప్రదేశ్ పై, పురుషుల విభాగంలో రైల్వేస్ 39-12తో పుదుచ్చేరిపై గెలిచి ఫ్రీ క్వార్టర్‌కు చేరాయి.
మహిళల విభాగంలో కొల్హాపూర్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ కూడా ఫ్రీ క్వార్టర్ చేరాయి. మెన్స్ క్యాటగిరీ క్వార్టర్స్‌లో తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్‌తో తలపడనుంది.