బుడాపెస్ట్: ప్రతిష్ఠాత్మక 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ పసిడి పతక వేటలో దూసుకెళుతున్నది. గురువారం ఇరాన్‌తో జరిగిన ఎనిమిదో రౌండ్లో భారత్ 3.5-0.5 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో రెండు రౌండ్లు మిగిలున్న టోర్నీలో టీమ్ఇండియా 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
ప్రపంచ నంబర్ఫోర్ ప్లేయర్ ఇరిగేసి అర్జున్ మరోమారు సత్తాచాటాడు. టోర్నీలో అపజయమెరుగని అర్జున్ 1-0తో దన్శేవర్ బర్దియాపై అలవోక విజయం సాధించాడు. నల్లపావులతో బరిలోకి దిగిన అర్జున్ భారత్ గెలుపులో కీలకమయ్యాడు. మిగతా గేముల్లో గుకేశ్, విదిత్ వియాలు సాధించగా, ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు.