Hamsini Chadaram | హైదరాబాద్, ఆట ప్రతినిధి: జమ్ము కశ్మీర్ వేదికగా జరిగిన 36వ సజ్జూనియర్ జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో రాష్ట్ర యువ షట్లర్ చదరం హంసిని విజేతగా నిలిచింది. శనివారం జరిగిన బాలికల అండర్-13 ఫైనల్లో హంసిని 21-17, 21-18తో బెదాగ్ని గొగోయ్(అస్సాం)పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన హంసిని వరుస గేముల్లో ప్రత్యర్థిని మట్టికరిపించింది.
బాలుర అండర్ -13 డబుల్స్‌లో రాష్ట్ర జోడీ విదిత్రెడ్డి, శ్రీచేతన్ 17-21, 13-21తో యూపీ ద్వయం ఆదిత్యసింగ్, తన్మయ్ వర్మ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇదే టోర్నీలో బాలుర సింగిల్స్‌లో అనికేత్ దత్తా, బాలికల డబుల్స్ లో ఆర్యమ చక్రవర్తి, లక్ష్మిసాయి విజేతగా నిలిచారు. ఇదే టోర్నీలో యువ షట్లర్ భవేశ్రెడ్డి మూడో స్థానంలో నిలిచాడు. విజేతలను బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్, భాస్కర్‌బాబు, బల్వీర్‌సింగ్, లక్ష్మణ్, వంశీధర్ తదితరులు అభినందించారు.