న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో పాల్గొనే అథ్లెటిక్స్ జట్టు నుంచి తెలంగాణ అమ్మాయి గంధె నిత్య, స్టార్ జావెలిన్ త్రోవర్ అన్ను రాణి, లాంగ్ జంపర్ షానవాజ్ ఖాన్‌ను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తప్పించింది. ఆటతీరు బాగా లేకపోవడం, వైద్య సంబంధ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. దాంతో ఆసియాడ్‌లో పాల్గొనే భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల సంఖ్య 74కి తగ్గింది.
‘గురువారం జరిగిన ఫైనల్ ట్రయల్‌లో నిర్దేశిత క్వాలిఫికేషన్ మార్కును అన్ను అందుకోలేకపోయింది. అందుకే ఆమె ను ఎంపిక చేయలేదు. ప్రదర్శన, వైద్య కారణాల వల్ల నిత్య, షానవాజ్‌ను తప్పించాం’ అని ఏఎఫ్ఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ సుమరివాలా తెలిపారు.