అమ్మాన్(జోర్డాన్) : జోర్డాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ జూనియర్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. అండర్-17లో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఫైనల్స్‌కు దూసుకెళ్లి కనీసం రజత పతకం ఖాయం చేశారు. దీంతో అండర్-15, 17 కేటగిరీల్లో భారత్‌కు ఇప్పటి వరకు 21 పతకాలు ఖరారయ్యాయి. మహిళల అండర్-17 సెమీస్‌లో ఖుషి చాంద్, అహనశర్మ, జన్నత్, సిమ్రన్‌జీత్‌కౌర్, హర్సిక, అన్శిక ప్రత్యర్థులపై విజయాలతో తుదిపోరులో నిలిచారు. మరోవైపు పురుషుల విభాగంలో దేవాంశ్ వియత్నాం బాక్సర్‌పై గెలిచి పసిడి పోరుకు అర్హత సాధించాడు.