మెల్బోర్న్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్టు(AUSvENG) తొలి రోజే 20 వికెట్లు కూలాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 152 రన్స్‌కు ఆలౌట్ అవ్వగా, ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇండ్లండ్ కేవలం 110 రన్స్‌కే కుప్పకూలింది. అయితే ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు రన్స్ చేసిన ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 46 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. తొలి మూడు టెస్టులను గెలుచుకుని టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా .. నాలుగవ టెస్టులోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది.
కానీ ఇవాళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్ జోష్ టాంగ్ దెబ్బతీశాడు. అతను 45 రన్స్ ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రమంగా తన వికెట్లను కోల్పోయింది. బ్యాటర్లు ఎవరూ హాఫ్ సెంచరీ చేయలేదు. మైఖేల్ నీసర్ అత్యధికంగా 35 రన్స్ చేశాడు. ఇక ఇంగ్లండ్ కూడా తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆ జట్టు మెల్బోర్న్ పిచ్‌పై ఏమాత్రం నిలవలేకపోయింది.
ఆసీస్ పేస్ బౌలర్ల దాడికి మళ్లీ చేతులెత్తేసింది. ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ ఒక్కడే రాణించాడు. అతను అత్యధికంగా 41 రన్స్ స్కోరు చేశాడు. చివరలో అట్కిన్సన్ కొన్ని మెరుపులు మెరిపించాడు. ఆసీస్ బౌలర్లలో మైఖేల్ నీసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ రెండు వికెట్లు తీసుకున్నారు.
Pacers call the shots as 20 wickets fall on the opening day of the MCG Test 😯#WTC27 | #AUSvENG 📝: https://t.co/SEp6T1bevk pic.twitter.com/fx2FI94G0q
— ICC (@ICC) December 26, 2025