Nithish Rana | న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలకు భద్రత లేకుండా పోతున్నది. కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా భార్య సాచి మార్వను కొందరు పోకిరీలు వేధించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన విధులు పూర్తి చేసుకుని కారులో ఇంటికి వెళుతున్న సాచిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వెంబడించారు. కారును ఢీకొడుతూ దురుసుగా ప్రవర్తించారు.
జరిగిన ఉదంతాన్ని సాచి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అయితే ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. ఫిర్యాదు తిరస్కరించిన పోలీసులు మరోమారు ఇలాగే జరిగితే వారి బైక్ నంబర్ నోట్ చేసుకోమంటూ సలహా ఇచ్చారు. జరిగిన ఉదంతంపై పలువురు సోషల్ మీడియాలో పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో వెనుకకు తగ్గిన పోలీసులు పోకిరీలను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.