ఆ ఫీట్ సాధిస్తే పోర్షె కారు.. లలిత్‌మోదీ ఆఫర్ కొట్టేసిన యువీ
సరిగ్గా 19 ఏండ్ల క్రితం భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్‌సింగ్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా లలిత్ మోదీ..టీమ్ఇండియా క్రికెటర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించాడు.
ముంబై: సరిగ్గా 19 ఏండ్ల క్రితం భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్‌సింగ్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా లలిత్ మోదీ..టీమ్ఇండియా క్రికెటర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించాడు. మెగాటోర్నీలో ఎవరైనా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు లేదా ఆరు వికెట్లు తీస్తే వారికి ఖరీదైన పోర్షె కారు బహుమతి ఇస్తానని మాటిచ్చాడు.
మోదీ ఆఫర్‌ను మనుసులో పెట్టుకున్న యువీ..ఇంగ్లండ్‌తో పోరులో స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి కొత్త చరిత్ర లిఖించాడు. బ్రాడ్‌ను ఉతికి ఆరేస్తూ యువీ ఆరు బంతులను సిక్స్‌లుగా మలిచాడు. మ్యాచ్ అయిపోగానే మోదీని కలిసిన యువీ ఏమైంది తన కారు అంటూ ప్రశ్నించాడట.
ఈ విషయాన్ని తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మోదీ పంచుకున్నాడు. ‘టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఒక రోజు టీమ్ఇండియా డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లినప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఆఫర్ ఇచ్చాను. ఎవరైతే ఆరు సిక్స్‌లు లేదా ఆరు వికెట్లు తీస్తే పోర్షె కారు బహుమతి ఇస్తానన్నాను.
ఇంగ్లండ్‌పై ఆ ఫీట్ సాధించిన యువీకి పోర్షె బదులుగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాను. అప్పట్లో పోర్షె కారు భారత్‌కు దిగుమతి కావాలంటే చాలా రోజులు పట్టేది. అన్ని రోజులు ఆగలేను బీఎండబ్ల్యూ అయినా ఓకే అంటూ యువీ చెప్పడంతో ఇచ్చిన మాట ప్రకారం కారు కొనిచ్చాను. అందుకు ప్రతిగా ఆరు సిక్స్‌లు కొట్టిన బ్యాటు యువీ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇప్పుడు అది 50 పోర్షె కార్లతో సమానం’ అంటూ మోదీ వివరించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

