పెర్త్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టు(Aus Vs Eng)లో తొలి రోజే 19 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 172 రన్స్‌కు ఆలౌటవ్వగా, ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 123 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా ఇంకా 49 రన్స్ వెనుకబడి ఉన్నది. ఆసీస్ స్పీడ్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లు తీసుకోగా, ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ అయిదు వికెట్లు తీసుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న పెర్త్ టెస్టులో తొలి రోజు మొత్తం 19 వికెట్లు కూలడం గమనార్హం.
ఇవాళ ఉదయం స్టార్క్ గడగడలాడించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను క్రమంగా పెవిలియన్‌కు పంపించాడు. 58 పరుగులు ఇచ్చిన అతను ఏడు వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. ఓలీ పోప్, జేమీ స్మిత్.. ఆసీస్ బౌలర్లను కాసేపు ఎదుర్కొన్నారు. కానీ స్టార్క్ ధాటికి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. అయితే తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా కూడా ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి వణికిపోయింది. జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ ఇద్దరూ ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. స్టోక్స్ 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో అయిదు వికెట్లు తీసుకోవడం స్టోక్స్‌కు ఇది ఆరోసారి. ఆస్ట్రేలియా మీదనే అతను మూడోసారి అయిదేసి వికెట్లు తీసుకున్నాడు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ 52, ఓలీ పోప్ 46, బెన్ డకెట్ 21, జేమీ స్మిత్ 33 రన్స్ చేశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 17, ట్రావిస్ హెడ్ 21, కెమరూన్ గ్రీన్ 24, అలెక్స్ క్యారీ 26 రన్స్ చేశారు.
England’s bowling attack were looking threatening enough… but then the skipper took it to another level!
Watch his five wickets: https://t.co/B1zT49wG1n pic.twitter.com/OoZfUITLub
— cricket.com.au (@cricketcomau) November 21, 2025