న్యూఢిల్లీ : భారత యువ ఆర్చర్ శీతల్‌దేవి తన సత్తాఏంటో చేతల్లో చూపెట్టింది. ఇప్పటికే పారా టోర్నీల్లో పతకాలు కొల్లగొడుతున్న శీతల్.. తాజాగా ఆసియాకప్ టోర్నీకి ఎదురైంది. జెద్దా వేదికగా త్వరలో జరిగే ఆసియా టోర్నీ కోసం ఎంపిక చేసిన జూనియర్ టీమ్‌లో శీతల్ చోటు దక్కించుకుంది. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న ఆర్చర్లతో పోటీపడ్డ ఈ జమ్ముకశ్మీర్ ఆర్చర్ 11.75 పాయింట్లతో ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచింది.
రెండు చేతులు లేకపోయినా కాలు సహాయంతో విల్లును ఎక్కుపెట్టే శీతల్ అద్భుత ప్రదర్శనతో ఆసియాకప్ బెర్తు దక్కించుకుంది. ఇటీవల జరిగిన పారా ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి ఆర్చర్(రెండు చేతులు లేని)గా శీతల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.