Agni Chopra World Record: బాలీవుడ్లో గతేడాది విడుదలై సంచలన విజయం దక్కించుకున్న 12th ఫెయిల్ (12th Fail Movie) మూవీ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా దేశవాళీ క్రికెట్లో జోరు కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు.. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ క్రికెట్ సీజన్ అయిన రంజీ క్రికెట్లోలో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. మేఘాలయాతో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో అగ్ని చోప్రా ఏకంగా రెండు ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలతో మెరిశాడు. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అగ్నికి ఇది ఐదో సెంచరీ కావడం విశేషం.
ఈ ఏడాది రంజీలలోకి అరంగేట్రం (మిజోరం తరఫున) చేసిన అగ్ని.. సిక్కీంతో జరిగిన తొలి మ్యాచ్‌లో 166, 92 (రెండో ఇన్నింగ్స్‌లలో) పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో నాగాలాండ్‌తో 164, 15 రన్స్ చేయగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో 114, 10 పరుగులు సాధించాడు. తాజాగా మేఘాలయాతో రెండు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలూ చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు 105, 101 శతకాలతో మెరిశాడు. నాలుగు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే అగ్ని ఐదు సెంచరీలు చేయడం గమనార్హం.
Agni Chopra son of Filmmaker Vidhu Vinod Chopra in his first four FC games:
– Vs Sikkim: 166 and 92
– Vs Nagaland: 166 and 15
– Vs Arunachal: 114 and 10
– Vs Meghalaya: 105 and 101He becomes the first-ever player to hit a hundred in each of his first four games. pic.twitter.com/EhO4c8u8O9
— Vipin Tiwari (@Vipintiwari952_) January 31, 2024
దేశవాళీ క్రికెట్లో భాగంగా వరుసగా నాలుగు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో ఐదు శతకాలు సాధించిన తొలి క్రికెటర్‌గా అగ్ని చోప్రా ప్రపంచ రికార్డు సాధించాడు. అగ్ని చోప్రా వరుస శతకాలపై అతడి తల్లి, ప్రముఖ సినీ విమర్శకురాలైన అనుపమా చోప్రా స్పందిస్తూ.. తల్లిగా తనకు గర్వంగా ఉందని ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించింది. అగ్ని చోప్రా వరుస శతకాలతో దేశవాళీ క్రికెట్లో అతడి పేరు మార్మోగిపోతోంది. ఇదే జోరు సీజన్ ఆసాంతం కొనసాగిస్తే అగ్ని చోప్రా రాబోయే రెండు మూడేండ్లలో భారత జట్టులో పోటీ పడే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
#proudmom https://t.co/Rde3Oc1LQ7
— Anupama Chopra (@anupamachopra) January 31, 2024