న్యూఢిల్లీ : అర్మేనియాలోని ఎరెవాన్లో జరుగుతున్న ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 12మంది భారత బాక్సర్లు ఫైనల్లో ప్రవేశించారు. శుక్రవారం జరిగిన ఆరంభ పోటీల్లో అమిష(54కి.), పాయల్(48కి.) 5-0 తేడాతో ప్రత్యర్థులపై విజయాలు నమోదు చేసి ఫైనల్లో ప్రవేశించారు. ప్రచి((80ప్లస్), మేఘ(80కి.) ప్రత్యర్థులపై విరుచుకుపడడంతో రెఫరీ మధ్యలోనే పోటీని నిలిపివేసి భారత బాక్సర్లను విజేతలుగా ప్రకటించారు. విని(75కి,), ఆకాంక్ష(70కి.), శృతి(63కి.) 5-0 తేడాతో ప్రత్యర్థులను మట్టికరపించి ఫైనల్స్‌కు చేరుకున్నారు.
నిషా(52కి.) ఆరంభంలో తడబడినా పుంజుకుని 4-1తో విజయం సాధించింది. బాలురలో అయిదుగురిలో నలుగురు విజయాలతో ఫైనల్స్‌కు అర్హత సాధించారు. హార్దిక్ పన్వర్(80కి.), హేమంత్ సంగ్వాన్(80ప్లస్) ప్రత్యర్థులను చిత్తుగా ఓడించారు. జతిన్(54కి.) 4-1తో, సాహిల్ 3-2తో విజయాలు సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నారు. కాగా నేహ(46కి.), నిధి(66కి.), పరి(50కి.), కృతిక(75కి.), సికిందర్(48కి.) కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.