హైదరాబాద్: సోమవారం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగే జాతీయ బధిరుల క్రికెట్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఆర్.విక్టర్ మోజెస్ సారధ్యం వహించనున్నాడు. ఈ టోర్నీ 14 నుంచి 20 వరకు జరుగనున్నది. రాజు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టు : ఆర్.విక్టర్ మోజెస్ (కెప్టెన్), రాజు (వైస్‌కెప్టెన్), హరి కృష్ణ, జి.రాజారాం, కె.మోజెస్ పీటర్, కె.ఎస్.మిత్ర, బి.పృధ్వీకాంత్, శామ్యూల్, కె.వి.ఎలుమలై, జి.రాంబాబు, ఎస్.వేణు, ఎ.సంపత్, పి.చెల్లయ్య, పి.వెంకటేశ్వర్రావు, ఎస్.చిరంజీవి. మేనేజర్-వై.శివ రంగనాయకులు. కోచ్-సంతోష్ కుమార్ డియాన్.