సిరిసిల్ల రూరల్, జూలై 31 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన మెరుపుల హృతిక్గౌడ్ జాతీయస్థాయి కిక్‌బాక్సింగ్ టోర్నీలో మెరుపులు మెరిపించాడు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరిగిన ఆల్ఇండియా కిక్ బాక్సింగ్ పోటీల్లో పసిడి పతకంతో సత్తాచాటాడు. తన పవర్ఫుల్ పంచ్‌లతో చెలరేగుతూ ప్రత్యర్థులను మట్టికరిపించి ఓవరాల్ చాంపియన్‌షిప్ దక్కించుకున్నాడు. గత నెలలో మహారాష్ట్ర జలగావ్లో జరిగిన జాతీయ కిక్‌బాక్సింగ్ పోటీల్లో హృతిక్ స్వర్ణం సాధించాడు. ఓవైపు సీఏ పరీక్షలకు సిద్ధమవుతూనే కిక్‌బాక్సింగ్‌లో పతకాలు సాధించడం ఆనందంగా ఉందని అతని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మా ఊరి యువకుడు జాతీయస్థాయి పోటీల్లో పతకాలు గెలువడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.