కౌలాలంపూర్: ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో శ్రీకృష్ణ నారాయణన్ టైటిల్ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఏకపక్ష ఫైనల్లో నారాయణన్ 5-1తేడాతో హబిబ్ సాహబ్(బహ్రెయిన్)పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన దూకుడు ప్రదర్శించిన నారాయణన్ చూడచక్కని షాట్లతో అభిమానులను అలరించాడు.
తొలి ఫ్రేమ్‌లోనే 25 పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన కృష్ణ..మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. హబీబ్ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నించినా ఎక్కడ అవకాశమివ్వకుండా తనదైన ఆధిపత్యాన్ని కనబర్చిన నారాయణన్ టైటిల్ దక్కించుకున్నాడు.