కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీ ప్రధాన డ్రాకు మాళవిక బన్సోద్, అస్మిత చలిహ మహిళల ప్రధాన డ్రాకు అర్హత సాధించారు. మంగళవారంనాటి పోటీల్లో ప్రపంచ 42వ ర్యాంకర్ మాళవిక 21-12, 21-19తో చైనీస్ తైపీకి చెందినలిన్ సియాంగ్‌పై, 53వ ర్యాంకర్ అస్మిత 10-21, 21-19, 21-17తో కెనడాకు చెందిన వెన్ యు జాంగ్‌పై గెలుపొందారు.
ప్రధాన డ్రా తొలి రౌండ్లో మాళవిక రెండో సీడ్ వాంగ్ జి యితో, అస్మిత నాలుగో సీడ్ హాన్ యూతో తలపడతారు.