కోల్‌కతా: వచ్చే ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వాట్సన్‌ను నియమించుకుంది. ఆసీస్ రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో సభ్యుడైన వాట్సన్‌కు ఐపీఎల్‌లోనూ సుదీర్ఘ అనుభవముంది.
గతంలో పలుజట్ల కోచింగ్ బృందంలోనూ అతడు సేవలందించాడు. కోల్‌కతాకు మరో టైటిల్ అందించేందుకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా వాట్సన్ ఒక ప్రకటనలో తెలిపాడు.