దోహా : భారత మహిళా క్యూయిస్ట్ అనుపమ రామచంద్రన్ గురువారం సరికొత్త చరిత్ర సృష్టించింది. దోహా వేదికగా ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్ (ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న తొలి భారత మహిళగా ఆమె రికార్డులకెక్కింది.
టైటిల్ పోరులో అనుపమ.. 3-2తో ఎంగ్ ఆన్ యీ (హాంకాంగ్)పై చారిత్రక విజయం సాధించి ఈ ఘనతను అందుకుంది.