కుమమొటొ : జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలిరోజు మాదిరిగానే రెండోరోజూ భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్స్ చేరగా ప్రణయ్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది.
గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్.. 21-13, 21-11తో జియా హెంగ్ జాసన్ (సింగపూర్)ను వరుస గేమ్స్‌లో చిత్తుచేశాడు. అద్భుత పోరాటపటిమతో తొలి రౌండ్ గండాన్ని దాటిన ప్రణయ్.. 18-21, 15-21తో రస్మస్ గెమ్కె (డెన్మార్క్)కు తలవంచాడు.