సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

మినీ స్టేడియం కోసం స్థల సేకరణకు కృషి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
వైకుంఠధామం నిర్మాణ పనులు ప్రారంభం
చేర్యాల : పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాల పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. బుధవారం రూ.30 లక్షల పట్టణ ప్రగతి నిధులతో నిర్మించే వైకుంఠధామం నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయ నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రస్తుతం ఉన్న కార్యాలయం ఇరుగ్గా ఉండడంతో ప్రజలతో పాటు మున్సిపల్ కౌన్సిల్‌కు ఇబ్బందికరంగా ఉందన్నారు. గత కొన్ని నెలలుగా చేర్యాల ప్రాంత యువత కోరుకుంటున్న విధంగా మినీ స్టేడియం నిర్మించేందుకు స్థలాన్ని సేకరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పట్టణంలోని పెద్దచెరువు మత్తడి నీరు ప్రధాన రోడ్డుపైకి రావడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డట్టు తెలిపారు. ప్రజల ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి అన్నివర్గాల కోరిక మేరకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి మత్తడి నీటి మళ్లింపు కాల్వ నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. అభివృద్ధి పనులను సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. కాల్వ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి పట్టణంలోకి చుక్క నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. సంక్రాంతి పర్వదినం వరకు దాతల సహకారంతో వైకుంఠ రథం ఏర్పాటు చేస్తానని, దాతలు ముందుకు రాకపోతే తానే రథం అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరగా డంపింగ్ యార్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్, కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీశ్, చెవిటి లింగం, మంగోలు చంటి, ముస్త్యాల తారయాదగిరి, మల్లన్న ఆలయ మాజీ చైర్మన్ ముస్త్యాల కిష్టయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ఒకటో డివిజన్ ఇన్చార్జిగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
చేర్యాల : త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి డివిజన్ ఇన్చార్జిగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో తనకు కేటాయించిన మొదటి డివిజన్లో విజయం సాధించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించానని చెప్పారు. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనకు 1వ డివిజన్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నామని గుర్తు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు చేయడం కోసం చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల నుంచి 100 మంది చురుకైన నాయకులు, కార్యకర్తలను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసేవరకు 100 మంది కార్యకర్తలు అక్కడే ఉండే విధంగా అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ఏనాడూ హైదరాబాద్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌తోపాటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
తాజావార్తలు
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- కొవాగ్జిన్ సామర్థ్యం.. 81%
- ‘రాసలీలల’ మంత్రి రాజీనామా
- ప్రభుత్వంతో విభేదించడం దేశద్రోహం కాదు
- 24/7 వ్యాక్సినేషన్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్
- సోషల్ మీడియా నియంత్రణపై రాష్ర్టాలకు అధికారం లేదు
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
- వెన్నునొప్పి ఉంది.. గుర్రం మీదొస్తా !
- జనాభాలో వాళ్ల వాటా 19.. సంక్షేమ పథకాల్లో 35 శాతం