గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Jul 10, 2020 , 23:46:23

మల్లన్న ఆదాయం 36.39లక్షలు

మల్లన్న ఆదాయం 36.39లక్షలు

చేర్యాల : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ హుండీని ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్‌, సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో విశ్వనాథశర్మ, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌ పర్యవేక్షణలో శుక్రవారం రాత్రి వరకు లెక్కింపు చేపట్టారు. మార్చి 6న ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. అనంతరం కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో లెక్కింపులు జరుగలేదు. నాలుగు నెలల నాలుగు రోజుల అనంతరం ఐదు హుండీలను ఆలయ అర్చకులు, ఉద్యోగులు, తాత్కాలిక సిబ్బంది, కార్మికులతో కలిసి జరిపిన లెక్కింపులో రూ.36, 39,822 ఆదాయం వచ్చింది. భక్తలు సమర్పించిన మిశ్రమ బంగారం, వెండి కానుకలను తూకం వేయకుండా హుండీలోనే భద్రపరిచారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో  మాట్లాడుతూ 5 హుండీల ద్వారా లభించిన నగదును స్థానిక ఏపీజీవీబీలో జమచేశామని, బియ్యం హుండీలను మరో రోజు తెరిచి తూకం వేస్తామన్నారు. లెక్కింపులో ఏఈవో గంగా శ్రీనివాస్‌, పర్యవేక్షకుడు నీల శేఖర్‌, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయంలోని 14 హుండీలకు గాను ఐదు హుండీలను లెక్కించారు. 


logo