సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - May 11, 2020 , 01:37:25

అన్నదాతను చూస్తుంటే ఆనందమైతాంది

అన్నదాతను చూస్తుంటే ఆనందమైతాంది

  • చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో కాలువలు, చెరువుల సందర్శన
  • కడుపు నిండా భోజనం చేసినంత తృప్తిగా ఉంది
  • యువత బాగా చదవాలి.. లేదా అమ్మ బాపుతో కలిసి పంటలు పండించాలి
  • సీజనల్‌ పంటలు, కూరగాయలపై దృష్టి పెట్టాలి
  • ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు

చిన్నకోడూరు/నంగునూరు : ‘గోదావరి జలాలతో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతుంటే సంబురమైతాంది.. అన్నదాత కం డ్లలో సంతోషం.. ముఖాల్లో చిరునవ్వులు కనబడుతుంటే.. కడుపునిండా భోజనం చేసినంత తృప్తిగా ఉంది’.. అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. రంగనాయకసాగర్‌ ఎడమ కాల్వతో చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌ అనంతమ్మ కుంట, మిలటరీకుంట, చిన్నరాయనికుంట, గుర్రాలగొంది, రామచెరువు లు, రామునిపట్ల చెక్‌డ్యాం నిండి, మత్తడి దుంకడంతో ఆదివారం జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మతో కలిసి మంత్రి హరీశ్‌రావు పూజలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. అంతకు ముందు మాంకాళమ్మ, పెద్దమ్మ, మాతమ్మ దేవాలయాల్లో అమ్మవార్లకు జల, క్షీరాభిషేకాలు చేశారు. అలాగే, రంగనాయకసాగర్‌ కుడి కాల్వతో నంగునూరు మండలంలోని అప్పలాయచెరువుకుంట, ముండ్రాయిలోని యజ్ఞం కుంటలు మత్తడి దుంకి పారుతుండడంతో గంగమ్మతల్లికి పు ష్పాభిషేకం చేసి, హారతి పట్టారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ఒకప్పుడు విఠలాపూర్‌లో తాగడానికి నీళ్లు కావాలని బిందెలు అడ్డం పెట్టిన రోజు లు చూశామన్నారు. కానీ ఇప్పుడు ఈ ఊర్లో చెరువు ఎండిపోవడ మే చూడరని నీళ్లు పుష్కలంగా ఉంటాయని చెప్పారు. మండలంలోని అన్ని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నింపుతామన్నారు. విఠలాపూర్‌లో 7643 క్వింటాళ్ల ధాన్యం పండిందని, రూ.1.35 కోట్ల కొనుగోళ్లు జరిగాయన్నారు. గ్రామంలో గోదాం నిర్మాణానికి రూ.5కోట్లు, అనంతమ్మకుంట కట్ట బలోపేతానికి రూ.1.38 కోట్లు, శ్మశాన వాటికకు రూ.30 లక్షలు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. యువత బాగా చది వి, మంచి ఉద్యోగం పొందాలని, లేదా అమ్మ బాపుతో కలిసి సీజనల్‌ పంటలు, కూరగాయలు పండించి లాభాలు పొందాలని సూచించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం తేవడంతో పాటు మన ప్రాంతానికి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతే రాజు కావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నారని, ప్రతి రైతు లక్షాధికారి కావాలని, కాల్వల నీళ్లతో మూడు పంటలు తీయాలని, ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ తెలంగాణ కావాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, వైస్‌ ఎంపీపీ పాపయ్య, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఉమేశ్‌చంద్ర, శ్రీనివాస్‌, సర్పంచులు శ్రీనివాస్‌, లింగారెడ్డి, నవీన్‌, ఎంపీటీసీలు జ్యోతి, సునితా సాగర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వాగులు వంకలు దాటుకుంటూ..

గోదారమ్మ తమ ఊరి చెరువులోకి చేరి, మత్తడి దుంకుతుందని రైతులు చెప్పగానే, ఆనంద పరవశుడై మంత్రి హరీశ్‌రావు చెప్పులు లేకుండా వాగులు, వంకలు, చెరువు కట్ట, కాల్వలు దాటుకుంటూ రైతులతో ముచ్చటించుకుంటూ చెరువు వద్దకు బయలుదేరారు. అలాగే, విఠలాపూర్‌లోని అనంతమ్మకుంట వద్దకు సుమారు 3 కిలో మీటర్లు కాలినడకన వెళ్లారు. చంద్లాపూర్‌ మీదుగా వెళ్తున్న మంత్రి హరీశ్‌రావు ప్రధాన ఎడమ కాల్వలో పారుతున్న గోదావరి జలాల్లో ఈత కొడుతున్న యువతను కాసేపు వీక్షించారు.

ఎక్కడికక్కడే యూరియా పంపిణీ చేయాలి 

రైతులకు యూరియా బస్తాలు ఎక్కడికక్కడనే పంపిణీ చేయాలని, యూరియాకు ఏ రైతు చిన్నకోడూరు, సిద్దిపేటకు రాకుండా ఏర్పాట్లు చేయాలని ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్‌ను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. చిన్నకోడూరు మండలంలోని గంగాపూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.logo