గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Mar 01, 2020 , 22:43:53

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

చిన్నకోడూరు : మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్నదని జడ్పీ చైర్‌ పర్సన్‌ వేలేటి రోజాశర్మ పేర్కొన్నారు. మండల పరిధిలోని అల్లీపూర్‌ గ్రామంలో ఆదివా రం సర్పంచ్‌ రాజవ్వతో కలిసి మహిళా మండలి భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ రోజాశర్మ మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలు మహిళలు సద్వినియోగం చేసుకొని, అభివృద్ధి చెందాలని సూచించారు. మహిళలకు రుణాలు ఇవ్వడానికి అన్ని బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మహిళలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు ప్రతి నెలా తప్పకుండా చెల్లించాలని సూచించారు. 57 మహిళా సంఘాలకు సుమారు రూ.1.50కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేసినట్లు తెలిపారు. అల్లీపూర్‌ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, మహిళలు గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందించి, గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా సంఘ భవనానికి రూ.20 లక్షల నిధులు మంజూ రు చేసిన మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కస్తూర్బా గాందీ బాలికల పాఠశాల ఫేర్‌వెల్‌ పార్టీలో రోజాశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ కీసరి పాపయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌లు కనకరాజు, సదానందంగౌడ్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఉమేశ్‌ చంద్ర, మాజీ ఎంపీపీ రాంచంద్రం, సర్పంచులు ఎల్లయ్య, మహేందర్‌, ఎంపీటీసీ లచ్చయ్య, ఉప సర్పంచు మల్లయ్య, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.logo