శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 17, 2020 , 00:25:07

సీఎం కేసీఆర్‌కు మల్లన్న ఆశీస్సులు

సీఎం కేసీఆర్‌కు మల్లన్న ఆశీస్సులు

సమైక్య పాలన లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

  • దివ్యక్షేత్రంగా కొమురవెల్లి ఆలయం
  • అభివృద్ధికి నిదర్శనం ‘మల్లన్న’ ఆలయం
  • చిన్ననాటి నుంచి ఇక్కడకు వస్తున్నా..
  • పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

చేర్యాల, నమస్తే తెలంగాణ : సమైక్య పాలన లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. మల్లన్న స్వామిని ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ డిప్యూటీ కమిషనర్‌ టంకశాల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో ప్రధానార్చకుడు మల్లికార్జున్‌, ఆల య సిబ్బంది, ఆగమ పాఠశాల విద్యార్ధులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో స్వామిని దర్శించుకుని ప్రత్యే క పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.  

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడు తూ.. తాను చిన్ననాటి నుంచి కొమురవెల్లి మల్ల న్న ఆలయానికి వస్తున్నానని, నాటినుంచి జరగని ఆలయ అభివృద్ధి సీఎం కేసీఆర్‌ పాలనలో కేవ లం 6 ఏండ్లల్లో జరిగిందన్నారు. భక్తుల కోసం వసతులు కల్పిస్తుండడంతో ఆదాయం సైతం పెరుగుతున్నదని తెలిపా రు. భక్తులు సమర్పించి న వెండి కానుకలను కరిగించి ఆలయ ద్వారా లు, తలుపులకు వెండి తాపడం చేయిస్తున్నట్లు  తెలిపారు. ఆలయ సింహాద్వారాన్ని తాను స్వంత డబ్బులతో నిర్మించానని, గుట్టపై అధునిక వసతులతో గెస్ట్‌హౌజ్‌ నిర్మిస్తున్నట్లు వివరించారు. లిఫ్ట్‌ ఏర్పాటుతో వయోవృద్ధులు, దివ్యాంగుల సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.


* సీఎం కేసీఆర్‌కు ‘మల్లన్న ’ ఆశీస్సులు

సీఎం కేసీఆర్‌కు మల్లన్న ఆశీస్సులు నిండుగా ఉండాలని మల్లన్నను కోరుకున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఆలయ అభివృద్ధికి మంత్రి  హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుననట్లు తెలిపారు.  అనంతరం విజయ డైరీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆలయంలో లిఫ్ట్‌ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఈవోను ఆదేశించారు.


వచ్చే జాతరలోగా కొండ పోచమ్మ  ఆలయ పునర్నిర్మాణం 

జగదేవపూర్‌ : మండలంలోని తీగుల్‌నర్సాపూర్‌ కొండపోచమ్మ ఆ లయాన్ని పూర్తి స్థాయి లో అభివృద్ధి చేస్తామని పశుసంవర్థక, సినిమాటోగ్రఫి మంత్రి తలసా ని శ్రీనివాస్‌యాదవ్‌ అ న్నారు. కొండపోచ మ్మ ఆలయాన్ని కుటుంబ సభ్యులతో దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా మల్లన్నను దర్శించుకొని అమ్మవారికి సన్నిధికి చేరుకున్న మంత్రికి  అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలోనే కొండపోచమ్మ ఆలయాన్ని పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేద్దామని అనుకున్నప్పటికీ.. ఆలస్యమైందని.. వచ్చే జాతరలోగా ఆలయాన్ని అన్నిహంగులతో సాంప్రాదాయాలకు అనుగుణంగా  పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. నిర్మాణానికి అయ్యే నిధులపై నివేదిక ఇవ్వాలని ఆలయ అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి, అధికారులు వెంకట్‌రెడ్డి, కనకయ్య, సర్పంచ్‌ రజిత, స్థానిక నేత రమేశ్‌, అర్చకులు పాల్గొన్నారు.


logo