శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 15, 2020 , 23:24:09

టీఆర్‌ఎస్‌ గెలుపు ఏకపక్షం

టీఆర్‌ఎస్‌ గెలుపు ఏకపక్షం
  • సొసైటీ పదవులన్నీ గులాబీ సొంతం q సీఎం కేసీఆర్‌కు అండగా రైతులు
  • ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ భూపతిరెడ్డి

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఏకపక్షంగా మారిందని ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పన్యాల భూపతిరెడ్డితో కలసి ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు. 


గజ్వేల్‌ నియోజక వర్గంలోని అన్ని సహకార సంఘాల చైర్మన్‌ పదవు లను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు సొంతం చేసుకుంటానన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు సీఎం సీఎంపై ఉన్న నమ్మ కం మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీకి ఏకపక్షంగా విజయాన్ని అందించిందని పేర్కొన్నారు. 78 డైరెకర్లను 76 టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా, 6 చైర్మన్‌ పదవులను కూడా పార్టీ అభ్యర్థిలే ఎంపికవుతారన్నారు. గజ్వేల్‌లో ఏ ఎన్నికలు వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీకి ఏకపక్షంగా మా రిందని.. ప్రతిపక్ష పార్టీలకు ఏజెంట్‌ లేకుండా పోయా రని పేర్కొన్నారు. అలాగే, దేశంలో బీజేపీ పరిస్థితి దిగజారుతుందని.. ఢిల్లీలో ఆ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని తెలిపారు. ప్రజల తిరస్కారాన్ని బీజేపీ గుణపాఠంగా గుర్తించాలన్నారు. లాభాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటుందని విమర్శించారు. బంగారు తెలంగాణ, బంగారు భారత్‌ నిర్మాణానికి కేసీఆర్‌యే సమర్థుడని ప్రజలు విశ్వాసిస్తున్నారన్నారు. 

17న సీఎం కేసీఆర్‌ జన్మదిన కార్యక్రమాలు...

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా గజ్వేల్‌లో 17న పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పన్యాల భూపతిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఊరిలో మొక్కలు నాటే కార్యక్రమంతోపాటు ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో పూజలు, ప్రార్థనలు, అన్నదానలు, రక్తదాన శిబిరాలు,  పార్టీ వర్గాలు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  సమావేశంలో ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, డాక్టర్‌ యాదవరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీయుద్దీన్‌, మదాసు శ్రీనివాస్‌, మెట్టయ్య, దుర్గా ప్రసాద్‌, జేజేల వెంకటేశంగౌడ్‌ పాల్గొన్నారు.  


logo