శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 21, 2020 , 00:27:19

ఓటు మీది అభివృద్ధి పూచీ మాది

ఓటు మీది అభివృద్ధి పూచీ మాది


గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : ‘ఉద్యమ ఉపఎన్నికల సమయంలో మీరు టీఆర్‌ఎస్‌కు వేసిన ఓటు ఉద్యమ ఉధృతికి బాట వేసింది.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీకి వేసే ప్రతి ఓటు రాష్ట్ర అభివృద్ధికి బాట లు వేస్తాయి’.. అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హ రీశ్‌రావు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భం గా ప్రజ్ఞాపూర్‌ ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద సోమవారం జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడా రు. ‘ఓటు మీది.. అభివృద్ధి పూచి మాది’.. అని స్థానిక ప్రజలకు భరోసా ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పా ర్టీకి ఇచ్చిన మద్దతు ఎప్పుడు వృథా కాలేదని, అ ప్పుడు ఉద్యమాన్ని బలోపేతం చేస్తే, ఇప్పుడు అభివృద్ధికి మెట్లుగా మారయాన్నారు. తెలంగాణ అం టేనే టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను ని ర్మించడానికి కేసీఆర్‌ గుండె ధైర్యన్ని రాష్ట్ర ప్రజల తో పాటు మేధావులు కొనియడుతున్నారన్నారు. కాంగ్రెస్‌, బీజేపీకి స్థానికంగా ఒక్క వార్డుకూడా గె లుపు సాధ్యం కాదని, ఆ పార్టల నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఎద్దేవా చేశా రు. తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అంకితభావంతో పని చేస్తున్నదని మంత్రి హ రీశ్‌రావు పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం సమతరంగా రాష్ట్రంలో పరుగుతుల తీస్తున్నదన్నారు. కా ళేశ్వరం నీళ్లతో తెలంగాణ నేల పులకిస్తున్నదని, మ రో రెండు నెలల్లో గజ్వేల్‌ కొండపోచమ్మ రిజర్యాయర్‌కు సాగునీరు వస్తుందని స్పష్టం చేశారు. ఒకప్పుడు తెలంగాణలో ముంబై, దుబాయ్‌, బొగ్గు బాయే ఉపాధికి దిక్కుగా ఉండేదని, స్థానికంగా జరిగిన అభివృద్ధితో ఇతర ప్రాంతాల వారే ఇక్కడికే వలసలు వచ్చే అవకాశాలు ఏర్పడ్డాయన్నారు.

గజ్వేల్‌ అభివృద్ధి అమోఘం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గజ్వేల్‌ను అభివృద్ధి లో అగ్రభాగం నిలిపారని మంత్రి హరీశ్‌రావు పే ర్కొన్నారు. స్థానిక ప్రజలు కూడా నియ్యత్‌దారుల ని, పని చేసిన నాయకుడికి పట్టం కడుతున్నారని, గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌లో 20కి 20 వార్డుల గెలుచుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ప్రజ్ఞాపూర్‌ బస్టాండ్‌ నిర్మాణం లేటైనా, లేటెస్టుగా నిర్మించుకుందామని తెలిపారు. శ్మశాన వాటిక, ఊర చెరువును మినీ ట్యాంకు బండ్‌గా మార్చుకోవడానికి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయన్నారు. నెల రోజుల్లో డబుల్‌ బెడ్రూం పంపిణీ జరుగుతుందన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరవుతుందన్నారు. ప్రజ్ఞాపూర్‌ పరిధిలోని 4 వార్డుల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. గజ్వేల్‌కు కాళేశ్వరం నీళ్లు వస్తే కాలం కాకున్న కుంటలు, చెరువుల మత్తళ్లు పారుతాయన్నారు. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ను అభివృద్ధితో పాటు ఆరోగ్యకరమైన పట్టణానిగా మార్చడానికి కృషి చేస్తున్నారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి, షాయిదా బేగం, పూలమ్మ, ఉప్పల మెట్టయ్య, తలకొక్కుల భాగ్యలక్ష్మిని గెలిపించాలన్నారు.

గెలిపిస్తే అభివృద్ధి సొంతం: ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌లోని 20వార్డుల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవడానికి వీలు కల్గుతుంద ని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపించుకొని స్థానిక ప్రజలు సీ ఎం కేసీఆర్‌ మనసు గెలుపుకోవాలన్నారు. ఈ స మావేశంలో టూరిజం చైర్మన్‌ పన్యాల భూపాతి రె డ్డి, డాక్టర్‌ యాదవ రెడ్డి, పంగ మల్లేశం, అమరావతి, ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్‌, అభ్యర్థులు పలువరు సీనియ ర్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.logo