Redmi 11 Prime 5G | చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ మార్కెట్లో విడుదల చేసిన రెడ్మీ 11 ప్రైమ్ 5జీ ఫోన్ ధర తగ్గించింది. భారత్ మార్కెట్లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ రూ.13,999 నుంచి రూ.12,999లకే అందుబాటులోకి తెచ్చింది. గత సెప్టెంబర్‌లో మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు దీని ధర రూ.13,999గా నిర్ణయించింది. 6జీబీ రామ్ విత్ 128 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ రూ.15,999 నుంచి రూ.14,999కి తగ్గించివేసింది.
మీడో గ్రీన్, క్రోమ్ సిల్వర్, థండర్ బ్లాక్ రంగుల్లో రెడ్మీ11 ప్రైమ్ 5జీ ఫోన్ లభ్యం అవుతుంది. షియోమీ అధికారిక వెబ్సైట్ ఎంఐ డాట్ కామ్ లేదా అమెజాన్ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ ఎంఐ డాట్ కామ్‌లో బుక్ చేసుకున్న కస్టమర్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.1000 ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నది. హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు రూ.750 ఇన్స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తున్నది. 2408 x 1080 పిక్సెల్స్ రిజొల్యూషన్ కలిగి ఉంటుంది. స్క్రీన్‌పై 90హెర్ట్జ్రీఫ్రెష్, స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం త్రీ లేయర్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అందిస్తున్నది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో వస్తున్నది. 4జీబీ లేదా 6జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ రామ్ సపోర్ట్‌తో ఈ ప్రాసెసర్ పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 12పై ఎంఐయూఐ14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది.
ఫోన్ బ్యాక్‌లో డ్యుయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్స్ ప్రైమరీ, 2 ఎంపీ డెప్త్ కెమెరా లభ్యం అవుతాయి. ఇక సెల్ఫీ కోసం 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ నుంచి సెకన్‌కు 30 ఫ్రేమ్స్ రికార్డ్స్ చేయొచ్చు.
రెడ్మీ 11 ప్రైమ్ 5జీ ఫోన్లో 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 22.5 వాట్ల టైప్ సీ చార్జర్ కూడా ఉంది. ఈ ఫోన్లో యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీలో 64 జీబీ నుంచి 128 జీబీ వరకు డేటా నిల్వ చేసుకోవచ్చు. ఈ స్టోరేజీ కెపాసిటీని 512 జీబీకి విస్తరించొచ్చు.
ఫోన్ ప్రొటెక్షన్ కోసం సైడ్ ఫింగర్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫెసిలిటీ కల్పించారు. 5జీ సపోర్ట్ డ్యూయల్ సిమ్+మైక్రో ఎస్డీ కార్డు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, బ్లూటూత్ 5.1, వై-ఫై లభిస్తాయి. ప్రాగ్జిమిటీ సెన్సర్, అంబియెంట్ లైట్ సెన్సర్, యాక్సెలెరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఐఆర్ బ్లాస్టర్ సెన్సర్లు లభ్యం అవుతాయి.