Xiaomi 12 series | కొన్ని ఫోన్లకు ఉన్న డిమాండ్ వేటికీ ఉండదు. ముఖ్యంగా ఐఫోన్స్. ఈ ఫోన్లు విడుదల అవ్వడమే ఆలస్యం.. హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. విడుదల అయిన రోజే లక్షల్లో సేల్స్ జరుగుతాయి. అంత డిమాండ్ ఉన్న బ్రాండ్స్‌లో యాపిల్ తర్వాత జియోమీ సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది. చైనాకు చెందిన ఈ కంపెనీ.. ఎంఐ, రెడ్మీ పేరుతో ఇప్పటి వరకు అత్యాధునికమైన ఫీచర్లలో పలు ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.
త్వరలో జియోమీ నుంచి 12 సిరీస్ విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా జియోమీ 12, జియోమీ 12 ప్రో ఫోన్లు డిసెంబర్ 28న చైనాలో విడుదల కానున్నాయి. అయితే.. ఈ ఫోన్ల లాంచ్ కంటే ముందే.. ప్రీ ఆర్డర్స్ చేసుకునే అవకాశాన్ని జియోమీ కల్పించింది. దీంతో ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా ఈ స్మార్ట్ఫోన్ల కోసం ప్రీ ఆర్డర్స్ వచ్చాయట.
పలు ఈ కామర్స్ వెబ్సైట్లలో ఈ ఫోన్ కోసం ముందే చాలామంది ప్రీ ఆర్డర్ చేసేశారట. ఈ ఫోన్లు కూడా అత్యాధునికమైన ఫీచర్లతో లాంచ్ కానున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం.. 2కే డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌తో ఈ స్మార్ట్ఫోన్లు విడుదల కానున్నట్టు తెలుస్తోంది. అలాగే.. గేమింగ్ కోసం ప్రత్యేకంగా హీట్ డిస్సిపేషన్ అనే ఫీచర్‌ను ఈ ఫోన్లలో తీసుకురానున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
హైఎండ్ కెమెరా టెక్నాలజీతో టెక్నో కేమన్ 18 స్మార్ట్‌ఫోన్ లాంచ్
హాట్ ఫీచర్లతో వివో 2 స్మార్ట్‌వాచ్ లాంచ్