స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ టెక్నో భారత్‌లో లేటెస్ట్ టెక్నో కేమన్ 18 స్మార్ట్‌పోన్ లాంఛ్ చేసింది. ఈ ఏడాది జులైలో ఎంట్రీ ఇచ్చిన కేమన్ 17కు కొనసాగింపుగా ఈ హ్యాండ్‌సెట్‌ను కంపెనీ లాంఛ్ చేసింది. 4జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకొచ్చింది.
స్ధిరమైన, యాంటీ షేకింగ్ వీడియోలను ఆఫర్ చేసే అడ్వాన్స్డ్ గింబల్ కెమెరా టెక్నాలజీతో కేమన్ 18 స్మార్ట్‌ఫోన్ కస్టమర్లను ఆకట్టుకోనుంది. కేమన్ 18..6.8 ఇంచ్ ఫుల్హెచ్డీ+ డిస్ప్లేతో మెరుగైన వ్యూయింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ హైపర్ ఇంజిన్ గేమింగ్ ఆప్టిమైజేషన్‌తో మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్‌ను కలిగిఉంటుంది. 18డబ్ల్యూ టైప్ సీ ఫ్లాష్ చార్జర్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీతో ముందుకొచ్చింది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఏఐ కెమెరాతో కేమన్ 18 ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ ఫీచర్లతో రూపొందిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌పై రన్ అవుతుంది.