Xiaomi 11T Pro | జియోమీ 11టీ ప్రో మోడల్ ఫోన్ ఎట్టకేలకు భారత్‌లో రిలీజ్ అవుతోంది. జనవరి 19, 2022న భారత్‌లో జియోమీ 11టీ ప్రోను లాంచ్ చేస్తున్నామని జియోమీ ప్రకటించింది. అయితే.. ఈ ఫోన్లో ఉండే ఫీచర్లు, ధర వివరాలను ప్రకటించనప్పటికీ ఈ ఫోన్‌ను ఇప్పటికే యూరప్‌లో లాంచ్ చేయడంతో అవే ఫీచర్లు, ధరతో భారత్‌లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
8జీబీ ప్లస్ 128 జీబీ, 8జీబీ ప్లస్ 256 జీబీ, 12జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజ్ కానుంది. బేసిక్ వేరియంట్ ధర సుమారు రూ.54,500 ఉంటుందని అంచనా వేస్తున్నారు. యూరప్‌లో జియోమీ 11టీ 5జీ, 11 లైట్ 5జీ ఎన్ఈ పేరుతో ఈ మోడల్ ఫోన్లు విడుదల అయ్యాయి.
It takes a revolution to create a powerful smartphone like this.
— Xiaomi India | #Xiaomi11TPro ⚡️ (@XiaomiIndia) January 10, 2022
Introducing #𝗧𝗵𝗲𝗛𝘆𝗽𝗲𝗿𝗽𝗵𝗼𝗻𝗲 – Xiaomi 11T Pro
Experience the perfect amalgamation of Design & Power on 19.01.2022
The Revolution continues.#HyperchargeRevolution
Know more: https://t.co/2syPoOtfsz pic.twitter.com/3MJcrEZzqu
6.67 ఇంచ్ 10 బిట్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్వోసీ ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్, 108 ఎంపీ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్స్ హైపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్, డుయల్ స్టీరియో స్పీకర్స్ లాంటి ఫీచర్లతో జియోమీ 11టీ ప్రో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.