WhatsApp: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే..అకౌంట్ డిలీట్ అవుతుందా?

ముంబై: ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్( WhatsApp ) ఈ ఏడాది తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్( privacy policy update ) అమలును మళ్లీ వాయిదా వేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఈ పాలసీని అమలు చేయాలని వాట్సాప్ తొలుత భావించినా వినియోగదారుల నుంచి విమర్శలు రావడంతో కొత్త పాలసీ అమలును 3 నెలలు పాటు వాయిదా వేసింది. మే 15 నుంచి అమలు చేస్తామని ఆనాడే వెల్లడించింది.
అయితే తాజాగా ఆ నిర్ణయాన్ని కూడా మరోసారి వాయిదా వేసింది. కొత్త పాలసీని అప్డేట్ చేయకున్నా మే 15 నుంచి ఏ అకౌంట్లను నిలిపివేయబోమని స్పష్టం చేసింది. ఖాతాలను తొలగించేది లేదని వాట్సాప్ హామీ ఇచ్చింది. ఐతే వాట్సాప్ కొత్త నిబంధనలు అంగీకరించకపోతే వాట్సాప్ సేవలను మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేరు. యూజర్లు కాల్స్, నోటిఫికేషన్లను మాత్రమే పొందగలుగుతారు. గతంలో మాదిరిగానే టెక్స్ట్, వీడియో కాలింగ్‌తో సహా అన్ని ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.
రాబోయే రోజుల్లోనూ రిమైండర్లతో కొత్త పాలసీపై అవగాహన కల్పిస్తామని వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది. కొత్త నిబంధనలు అంగీకరించినంత మాత్రాన యాప్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవని వివరించింది. వాట్సాప్ కొత్త పాలసీని చాలా మంది యూజర్లు ఇప్పటికే అంగీకరించారని,
మరికొంత మందికి ఇంకా ఆ అవకాశం రాలేదని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. సాధారణ యూజర్లకు సంబంధించి ఎలాంటి మార్పులు లేవని, వాట్సాప్‌తో బిజినెస్ చేసేవారికే ఆ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.

Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

