న్యూఢిల్లీ : వాట్సాప్ యూజర్లు ఏఐ స్టిక్కర్స్‌ను (AI stickers) క్రియేట్ చేసి షేర్ చేసే వెసులుబాటును ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ఇంగ్లీష్ టెక్ట్స్‌కు సపోర్ట్ చేస్తుండగా ఎంపిక చేసిన దేశాల్లో లభిస్తోంది. యాప్‌పై వాట్సాప్ యూజర్ల చాట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఏఐ స్టిక్కర్ ఫీచర్ మెరుగుపరుస్తుందని మెటా పేర్కొంది.
యూజర్ల టెక్ట్స్ ప్రాంప్ట్స్‌ను మల్టిపుల్ యూనిక్, హై క్వాలిటీ స్టిక్కర్స్‌గా తమ ఏఐ టూల్ సెకండ్ల వ్యవధిలో మార్చేస్తుందని మెటా అధికారిక బ్లాగ్ పోస్ట్ తెలిపింది. ఈ ఫీచర్‌ను ఇప్పటివరకూ బీటా టెస్టింగ్‌లో ఉంచగా, ఇప్పుడు వాట్సాప్‌లో ఏఐ స్టిక్కర్స్‌ను మెటా అధికారికంగా లాంఛ్ చేసింది. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఏఐ స్టిక్కర్స్‌ను క్రియేట్ చేశారు.
యూజర్లు టెక్ట్స్ ప్రాంప్ట్ ప్రకారం ఈ ఏఐ స్టిక్కర్లు ఆటోమేటిక్‌గా స్టిక్కర్ ట్రేలో కనిపిస్తాయి. వీటిని ఏ సమయంలోనైనా కాంటాక్ట్స్‌తో షేర్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఇక ఏఐ స్టిక్కర్స్‌ను ఎలా క్రియేట్ చేసుకోవాలంటే..వాట్సాప్‌లో చాట్‌ను ఓపెన్ చేసి మోర్ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి ఆపై క్రియేట్ సెలెక్ట్ చేసి టెక్ట్స్ ప్రాంప్ట్ ఇచ్చి కంటిన్యూ ట్యాప్ చేయాలి. మీరు కోరుకుంటున్న స్టిక్కర్ డిస్క్రిప్షన్ ఇవ్వగానే నాలుగు స్టిక్కర్లు జనరేట్ అవుతాయి. స్టిక్కర్‌ను సెండ్ చేసేందుకు ట్యాప్ చేయాలి. ఈ సింపుల్ స్టెప్స్‌తో ఏఐ స్టిక్కర్స్‌ను క్రియేట్ చేసి షేర్ చేసుకోవచ్చు.
Read More :
Watch: పెట్రోల్ బంక్ సిబ్బందిని గన్‌తో బెదిరించి దోచుకున్న దుండగులు