Whatsapp | ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జత చేస్తూ వాట్సాప్ తమ వినియోగదారులకు మరింత దగ్గరవుతున్నది. ఈ క్రమంలో ఇటీవలే ‘View Once’ ఫీచర్ను ఫొటోలు, వీడియోల కోసం అందించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు అదే తరహాలో వాయిస్ మెసేజ్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించడం ద్వారా సెన్సిటివ్ సమాచారం అందించేటప్పుడు అదనపు గోప్యత పొందవచ్చు. ఈ వ్యూ వన్స్ వాయిస్ మెసేజ్ ఎలా పంపాలంటే.. మీ WhatsApp చాట్ ఓపెన్ చేయండి. తర్వాత టెక్ట్స్ బాక్స్ పక్కన ఉన్న మైక్రోఫోన్ బటన్ను ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. పైకి స్లయిడ్ చేసి లాక్ చేయండి.
రికార్డ్ అయిన తరువాత ‘View Once’ ఐకాన్ (సర్కిల్లో ‘1’ గుర్తు)పై ట్యాప్ చేయండి. చివరగా సెండ్ బటన్పై క్లిక్ చేయండి. ‘View Once’ వాయిస్ మెసేజ్ ఫీచర్ను గోప్యతను కాపాడేందుకే కాదు, క్రెడిట్ కార్డ్ వివరాలు లాంటి సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసేటప్పుడూ దీనిని వాడొచ్చు. అంటే.. అత్యంత సన్నిహితులకు ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని వాయిస్ రూపంలో పంపించాల్సి వస్తే ఇలా ‘వ్యూ వన్స్’ ఆప్షన్ని ఎనేబుల్ చేసి పంపొచ్చు. దీనిద్వారా ఆడియోని ఒక్కసారి మాత్రమే వినగలుగుతారు. తర్వాత అది ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. పైగా, వాట్సాప్ ఈ మెసేజ్లకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కల్పిస్తున్నది. దీంతో డేటాని ఇతరులు పొందడం అనేది అసాధ్యం.