Whatsapp Status | వాట్సాప్‌లోనే కాదు.. ఫేస్‌బుక్‌లోనూ స్టేటస్ అప్లోడ్.. అదేలాగంటే?!
Whatsapp Status | కేవలం వాట్సాప్‌లోనే కాదు.. ఒకేసారి వాట్సాప్‌తోపాటు ఫేస్‌బుక్‌లోనే స్టేటస్ అప్లోడ్ చేసే ఫీచర్ త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నది.
Whatsapp Status | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మన ఇష్టాయిష్టాలను ఇతరులతో షేర్ చేసుకోవడానికి బెటర్ ప్లాట్‌ఫామ్. ఇష్టాయిష్టాలతోపాటు పర్సనల్ అంశాలు కూడా ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ వాట్సాప్ స్టేటస్ నిత్యం వాడుతున్నారు. ఇదే వాట్సాప్ స్టేటస్.. ఫేస్‌బుక్‌లోనూ స్టోరీగా పోస్ట్ చేయాలనిపించవచ్చు. ఫేస్బుక్లో పోస్ట్ చేయడానికి స్పెషల్‌గా అప్లోడ్ చేయాలి.. వాట్సాప్ అలాంటి అవసరం లేకుండా కొత్త ఫీచర్ తీసుకొస్తున్నది. ఈ ఫీచర్ తీసుకొస్తే వాట్సాప్ స్టేటస్‌తోపాటు ఫేస్బుక్లో స్టోరీ పోస్ట్ చేయొచ్చు.
అందుకోసం వాట్సాప్ స్టేటస్ ప్రైవసీ సెటింగ్స్‌లో మై కాంట్రాక్ట్స్ (My Contacts), మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ (My Contacts Except), ఓన్లీ షేర్ విత్ (Only Share With) అనే మూడు ఆప్షన్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇక నుంచి వాటి కింద ఫేస్బుక్ (Facebook) అనే కొత్త ఆప్షన్ రాబోతున్నది. రెండు సోషల్ మీడియా ప్లాట్‌పామ్స్‌లో స్టేటస్ పెట్టాలనుకునే యూజర్లు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే సరి. ఫేస్బుక్ అకౌంట్ కూడా యాడ్ అవుతుంది.
ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్ అకౌంట్ స్పెషల్‌గా ఓపెన్ చేయాల్సిన పని లేకుండా రెండు ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఒకేసారి స్టేటస్ పెట్టొచ్చు. ఇప్పుడు ఈ ఫీచర్ ట్రయ్స్ దశలోనే ఉంది. త్వరలోనే ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తున్నది. అయితే వాట్సాప్ తన యూజర్లకు ఈ ఫీచర్ ఆప్షనల్‌గానే వినియోగంలోకి తెస్తున్నదని సమాచారం.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

