Whatsapp | ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఇకపై మీ ప్రొఫైల్ పిక్‌లో పెట్టుకున్న పర్సనల్ ఫొటోలను ఇతరులు ఎవరూ స్క్రీన్‌షాట్ తీసుకోలేరు. ఈ మేరకు స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ ప్రొఫైల్ ఫొటో పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. యూజర్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో వాట్సాప్ మాతృసంస్థ మెటా ఈ ఫీచర్‌ను డెవలప్ చేసింది.
చాలామంది తమ పర్సనల్ ఫొటోలను ప్రొఫైల్ పిక్లా పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. తమ సరదా కోసం యూజర్లు ఇలా పెట్టుకుంటారు.. కానీ కొంతమంది ఆకతాయిలు ఇదే అదునుగా తీసుకుని వాళ్ల డీపీలోని వ్యక్తిగత ఫొటోలను స్క్రీన్ షాట్ తీసుకుని మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తుంటారు. దీనివల్ల ముఖ్యంగా యువతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు మనం చూస్తేనే ఉంటున్నాం. ఈ క్రమంలోనే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ మాతృసంస్థ మెటా కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నది. ఎవరైనా మన ప్రొఫైల్ పిక్ లేదా, స్టేటస్‌ను స్క్రీన్‌షాట్ తీసినప్పుడు ఆ ఫొటోకు బదులుగా బ్లాక్ స్క్రీన్ చూపించనుంది.
స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ ప్రొఫైల్ ఫొటో పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐవోఎస్‌లోనూ దీన్ని తీసుకొచ్చేందుకు వాట్సాప్ సిద్ధమయ్యింది. ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను తొందరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.