Meta India | మెటా అనుబంధ వాట్సాప్ ఇండియా హెడ్, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మంగళవారం రాజీనామా చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా ప్రకటించిన కొన్ని రోజులకే వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
వాట్సాప్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివ్‌నాథ్ థుర్కల్ను మెటా ఇండియా బ్రాండ్స్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మెటా నియమించింది. ఇంతకుముందు ఈ నెల ప్రారంభంలో మెటా ఇండియా హెడ్‌గా ఉన్న అజిత్ మోహన్ కూడా వైదొలిగారు. ఆయన స్నాప్ ఆసియా-పసిఫిక్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.
అభిజిత్ బోస్ సేవలను వాట్సాప్ హెడ్ విల్క్యాత్కార్ట్ ప్రశంసించారు. `వాట్సాప్ ఇండియా తొలి అధిపతిగా ఎనలేని సేవలందించినందుకు అభిజిత్ బోస్‌కు ధన్యావాదాలు తెలుపుతున్నా. ఆయన తీసుకున్న నిర్ణయాలతో లక్షల మంది ప్రజలు, వ్యాపారాలకు లబ్ధి చేకూర్చేలా మా టీమ్‌ను తీర్చి దిద్దారు` అని విల్క్యాథ్ కార్ట్ పేర్కొన్నారు.
రాజీవ్ అగర్వాల్ సైతం ఇతర అవకాశాలు పొందేందుకు రాజీనామా చేశారని మెటా ఓ ప్రకటనలో తెలిపింది. గత సెప్టెంబర్‌లో వాట్సాప్ పేమెంట్ హెడ్‌గా పని చేసిన మనేశ్ మహాత్మే వైదొలిగారు.