Parental Tips | మీ పిల్లలు ఆన్లైన్లో ఏం నేర్చుకుంటున్నారు? అడ్డదారులు తొక్కకుండా ఉండాలంటే ఈ పని చేయండి
Parental Tips పుట్టిన మరుక్షణమే సెల్ఫీకి పోజిచ్చే జెనరేషన్ ఇది. బారసాల రోజే డిజిటల్ బహుమతులు అందుకునే తరమిది. అన్నప్రాశన రోజు అన్నీకాదని స్మార్ట్‌ఫోన్ అందుకునే వింత ధోరణి. ఫోన్ చూపిస్తూనే గోరుముద్దలు, అందులోనే లాలిపాటలు! బడిలో డిజిటల్ పాఠాలు, బడి లేకపోతే ఆన్లైన్ క్లాస్‌లు ఇదీ తంతు. ఆటలూ ఫోన్లోనే!!
Parental Tips పుట్టిన మరుక్షణమే సెల్ఫీకి పోజిచ్చే జెనరేషన్ ఇది. బారసాల రోజే డిజిటల్ బహుమతులు అందుకునే తరమిది. అన్నప్రాశన రోజు అన్నీకాదని స్మార్ట్‌ఫోన్ అందుకునే వింత ధోరణి. ఫోన్ చూపిస్తూనే గోరుముద్దలు, అందులోనే లాలిపాటలు! బడిలో డిజిటల్ పాఠాలు, బడి లేకపోతే ఆన్లైన్ క్లాస్‌లు ఇదీ తంతు. ఆటలూ ఫోన్లోనే!! ఇలా బాల్యమంతా డిజిటల్ ప్రపంచంతో ముడిపడిన నయా జెనరేషన్ కౌమార దశకు వచ్చాక పెను సవాళ్లను ఎదుర్కొంటున్నది. సెల్‌ఫోన్, సామాజిక మాధ్యమాల ఉచ్చులో చిక్కుకొని కకావికలమవుతున్నది.
డిజిటల్ ప్రపంచం అంతులేని ఆకర్షణల కేంద్రం. అరవై ఏండ్లు పైబడిన వ్యక్తులే ఫోన్‌కు అంకితమవుతున్న రోజులు ఇవి. మనవడి సాయంతో స్మార్ట్ సంగతులు తెలుసుకొని యూట్యూబ్ రీల్స్ చూడటంలో బిజీ అయిపోతున్న పెద్దలు ఎందరో! పదిహేనేండ్లు దాటిన వారైతే ఖాళీ సమయం దొరికితే డిజిటల్ దునియాలో చక్కర్లు కొడుతున్నారు. పుట్టింది మొదలు ఫోన్‌తోనే జీవితం ముడిపడి జూమర్స్గా పేరున్న జెనరేషన్ జెడ్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాట్సాప్‌లో సందేశం రాసే క్రమంలో కీప్యానల్పై వేళ్లను కదిలించే తీరును చూసి టైపింగ్‌లో హయ్యర్ చేశారేమో అనిపిస్తుంది. ఫేస్బుక్, ఇన్‌స్టా, ట్విటర్ ఒకటేమిటి డిజిటల్ దునియాను దున్నేయడానికే పుట్టామన్నట్టుగా ఉంటుంది వాళ్ల వ్యవహారం. అరచేతిలో ప్రమాదకర ఆయుధంతో మసులుతున్న ఈ పిల్లలు సేఫ్‌గా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించడం తప్పనిసరి.
తల్లిదండ్రుల బాధ్యత
ఈ రోజుల్లో ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఫోన్, ల్యాప్‌టాప్ వంటి గ్యాడ్జెట్స్ తల్లిదండ్రులే పిల్లలకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అవి ఇచ్చేసి వాళ్లు చదువుకుంటారులే అని హాల్లో టీవీ చూస్తూ కూర్చుంటే తప్పు చేసినవారే అవుతారు. పిల్లలు క్లాస్ వింటున్నారో, మరేదైనా వెబ్సైట్ ఓపెన్ చేశారో గమనించాలి. స్క్రీన్టైమ్ పక్కాగా ఫిక్స్ చేయాలి.
➣ సోషల్ మీడియాలో పాజిటివ్, నెగెటివ్ రెండు ధోరణులూ కనిపిస్తుంటాయి. ఆన్లైన్లో ఆరోగ్యకరమైన సామాజిక సంబంధాలు కలిగి ఉండేలా పిల్లలకు సూచన చేయాలి. సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ వేధింపులకు పురిగొల్పే వెబ్సైట్ల జోలికి వెళ్లకుండా వారికి సూచనలు ఇవ్వాలి.
➣ వేరే వ్యాపకం లేకపోతేనే పిల్లలు ఫోన్ జోలికి వస్తారు. ఫోన్, డిజిటల్ గ్యాడ్జెట్స్‌తో సంబంధం లేని ఆటలు, ఇతర విషయాలపై ఆసక్తి కలిగించి ఎంగేజ్ చేయాలి. టీనేజర్లను పూర్తిస్థాయిలో నిర్బంధించలేం కానీ, డిజిటల్ డిటాక్షన్ ప్రాధాన్యాన్ని తెలియజేయాలి.
➣ ఆన్లైన్లో జాగ్రత్తగా ఎలా వ్యవహరించాలో చెప్పాలి. స్కామర్లు ఎలా వల పన్నుతారు, గేమ్ యాప్స్ మాయాజాలం, క్రెడిట్‌కార్డు మోసాలు తదితర అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి.
➣ వెబ్సైట్ల సెర్చ్ హిస్టరీ, సోషల్ మీడియాలో పిల్లలు చేస్తున్న పోస్టుల ఆధారంగా వాళ్ల ఆలోచన విధానం ఎలా ఉందో అంచనాకు రావచ్చు. వాటి ఆధారంగా దారి తప్పినట్టు అనిపిస్తే మార్గనిర్దేశనం చేయాలి.

Children Socialmedia2
ముందస్తుగా గుర్తిస్తేనే..
➣ ఎదిగీ ఎదగని వయసులో సైబర్ బుల్లీయింగ్ పాలబడితే పిల్లల మానసిక స్థితి తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎదురైన తర్వాత చింతించడం కన్నా, ముందుగానే ఆన్లైన్లో జరిగే అకృత్యాలపై పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం అవసరం. ఇలాంటి పర్థితులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చేలా వారికి నమ్మకాన్ని కలిగించాలి.
➣ వీలైనంత వరకు స్క్రీన్ టైమ్ తగ్గించాలి. ఉదయం వ్యాయామం, సాయంత్రం ఆటల్లో పాల్గొనే వాతావరణం కల్పిస్తే ఫోన్ వాడకం కొంతైనా తగ్గుతుంది.
➣ సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి సందేశాలు పెట్టాలి, ఏ పోస్టులకు స్పందించాలి, వేటికి స్పందించొద్దు వంటి విషయాలపై తల్లిదండ్రులు సూచనలు ఇస్తుండాలి.
అవగాహన తప్పనిసరి..
సైబర్ నేరాలు: డిజిటల్ దునియాలో హ్యాకింగ్, వ్యక్తిగత సమాచార దోపిడి, ఆన్లైన్ స్కామ్స్, లైంగిక వేధింపులు వంటి మోసాలకు అవకాశం ఉంది. కాస్త ఏమరుపాటుగా ఉన్నా వీటి ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంటుందని వివరించాలి.
స్పందించే తీరు: సామాజిక మాధ్యమాల్లో అతిగా ఆవేశపడితే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే! ఏ పోస్టులు చేయాలి, ఎలాంటి పోస్టులకు ఏ రకంగా రిైప్లె ఇవ్వాలో తెలిసుండాలి. తల్లిదండ్రులు, స్నేహితులతో డిజిటల్ ఇంటరాక్షన్ గురించి చర్చించడం వల్ల వేటికి ఎలా స్పందించాలో అవగాహన కలుగుతుంది.
ఉపాధ్యాయుల సహకారం: అకడమిక్ పాఠాలు కూడా ఆన్లైన్లో చెబుతున్న ఈ రోజుల్లో.. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం వల్ల కలిగే మంచితోపాటు అందులో ఉండే సమస్యలనూ ఉపాధ్యాయులు వివరించాలి. స్మార్ట్‌ఫోన్ భద్రత గురించి కూడా చెప్పాలి. కఠినమైన పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, డేటాను ఎలా కాపాడుకోవాలి, అందుకు సంబంధించిన సాంకేతిక విషయాల పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలి.
నిజ నిర్ధారణ: వెబ్సైట్లో, సోషల్ మీడియాలో గాలి వార్తలు కోకొల్లలుగా వస్తాయి. అవన్నీ నిజమని నమ్మితే ప్రమాదమే! విశ్వసనీయ సమాచారం ఎక్కడ అందుబాటులో ఉంటుందో చెప్పాలి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read More :
Cyber Crime Preventation Tips | సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారా? వెంటనే ఈ పనులు చేయండి!
Cinema Review | సినిమా రివ్యూలు ఇవ్వండి.. డబ్బులు ఇస్తామని మెసేజ్‌లు వస్తున్నాయా?
Tech Tips | సోషల్‌మీడియాలో మీ పిక్ పెడుతున్నారా? ఇలా చేస్తే బుక్కయినట్టే!
Fake Parcel Scam | విదేశాల నుంచి విలువైన బహుమతులు వస్తున్నాయా? అంత ఈజీగా నమ్మేయకండి
Online Abuse | అశ్లీల చెర నుంచి మీ పిల్లలను ఇలా కాపాడుకోండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

