NFT – Non Fungible Token | నాన్ ఫంగిబుల్ టోకెన్ లేదా ఎన్ఎఫ్టీ అనే పదాన్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాం. కానీ.. దాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. వచ్చే ఐదేళ్లలో నాన్ ఫంగిబుల్ టోకెన్ ప్రపంచాన్నే ఏలబోతోంది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. అసలు ఎన్ఎఫ్టీ అంటే ఏంటి? దీనికి ఎందుకంత క్రేజ్ వచ్చింది. అసలు.. దీంతో ఏం చేస్తారు? దీని వల్ల లాభాలు ఏంటి? మనలాంటి మధ్యతరగతి ప్రజలకు దీని వల్ల ఏమైనా ఒరిగేది ఉందా? అనే విషయాలను తెలుసుకుందాం రండి.
ఎన్ఎఫ్టీ గురించి చెప్పుకోవడానికి ముందు.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ(Blockchain Technology) గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే.. ఎన్ఎఫ్టీ.. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో నడుస్తుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీ అనేది కూడా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్. బ్లాక్‌చైన్ టెక్నాలజీలో సాలిడిటీ అనే ప్రోగ్రామిగ్ లాంగ్వేజ్‌ను ఉపయోగించి స్మార్ట్ కాంట్రాక్ట్స్ను డెవలప్ చేస్తారు. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా అప్లోడ్ అయ్యే డేటా యూనిక్‌గా ఉండేలా చేస్తుంది. హై సెక్యూరిటీతో హ్యాకర్స్‌కు దొరక్కుండా బ్లాక్స్‌లో డేటాను స్టోర్ చేస్తారు. అన్ని బ్లాక్స్‌ను లింక్ చేస్తారు. ప్రతి బ్లాక్‌లో సేమ్ డేటా ఉంటుంది. హ్యాకర్ ఒక బ్లాక్‌ను హ్యాక్ చేసినా.. మిగితా బ్లాక్స్‌లో డేటా సురక్షితంగా ఉంటుంది.
అందుకే.. బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్ఎఫ్టీలు వర్క్ అవుతాయి. ఇక.. ఎన్ఎఫ్టీల గురించి మాట్లాడుకుందాం. ఎన్ఎఫ్టీ అనేది ఒక అసెట్ లాంటిది. కాకపోతే అది డిజిటల్ అసెట్. ఒక్కసారి ఆ అసెట్‌ను స్టోర్ చేశాక.. వాలిడేట్ చేశాక.. దాన్ని రీప్లేస్ చేయలేం, మార్పులు చేయలేం.. దానికి కారణం.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ.
ఆ అసెట్ ఏదైనా కావచ్చు. ఒక ఫోటో కావచ్చు.. వీడియో కావచ్చు.. వెబ్సైట్ అడ్రస్ కావచ్చు.. డిజిటల్ ఆర్ట్‌వర్క్ కావచ్చు.. ఏదైనా కావచ్చు.. ప్రస్తుతం డిజిటల్ ఆర్ట్‌వర్క్ ఎన్ఎఫ్టీలకు ఎక్కువ డిమాండ్ ఉంది.
ఒక డిజిటల్ అసెట్‌కు డిజిటల్ టోకెన్‌ను ఇస్తారు. దాన్నే హాష్ వాల్యూ అంటారు. నాన్ ఫంగిబుల్ అంటే యూనిక్, ఇర్రీప్లేసబుల్ అని అర్థం. అందుకే ఒక అసెట్‌కు ఇచ్చిన హాష్ వాల్యూ యూనిక్‌గా ఉంటుంది. దాని అథెంటిసిటీ కోసం ఆర్టిస్ట్ సిగ్నేచర్‌ను కూడా అసెట్ మీద సెట్ చేస్తారు.
నాన్ ఫంగిబుల్ టోకెన్స్‌ను డిజిటల్ లెడ్జర్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగించి స్టోర్ చేస్తారు. వాటి కోసం ప్రత్యేకంగా ఎన్ఎఫ్టీ మార్కెట్‌ప్లేస్‌లు ఉంటాయి. అందులో ఎన్ఎఫ్టీలను లిస్ట్ చేసుకోవచ్చు. వేలం వేసుకోవచ్చు. అమ్ముకోవచ్చు. ఓపెన్‌సీ, బియాండ్‌లైఫ్ డాట్ క్లబ్ లాంటి మార్కెట్‌ప్లేస్‌లు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. మన దేశంలో కూడా ఎన్ఎఫ్టీల బిజినెస్ స్టార్ట్ అయింది. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తన ఎన్ఎఫ్టీలను బియాండ్‌లైఫ్ డాట్ క్లబ్ ఎన్ఎఫ్టీ మార్కెట్లో లిస్ట్ చేశారు.
ఎన్ఎఫ్టీలు యూనిక్.. వాటికి హ్యాష్ కోడ్ ఉంటుంది. రీప్లేస్ చేయలేం. కానీ.. క్రిప్టోకరెన్సీలు ఫంగిబుల్ అసెట్స్. కరెన్సీ నోట్స్‌లా వాటిని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. క్రిప్టోకరెన్సీ అనేది ఒక కరెన్సీలా ఆపరేట్ చేయడం కోసం డెవలప్ చేసింది. బిట్‌కాయిన్, ఎథీరియం లాంటి క్రిప్టోకరెన్సీలను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
ఫోటోలు, వీడియోలు, జీఐఎఫ్ ఫోటోలు, మ్యూజిక్ లాంటి డిజిటల్ ఆర్ట్‌వర్క్‌ను ఎన్ఎఫ్టీగా మార్చుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. డిజిటల్‌గా ఉన్న ప్రతి దాన్ని ఎన్ఎఫ్టీలోకి మార్చుకోవచ్చు.
ఎన్ఎఫ్టీలను పబ్లిక్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్‌లలో కొనుగోలు చేయొచ్చు. పైన చెప్పుకున్నట్టుగా బియాండ్‌లైఫ్ డాట్ క్లబ్, ఓపెన్ సీ, నిఫ్టీ గేట్‌వే, రేరిబుల్ లాంటి ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్‌లో వాటిని కొనుగోలు చేయొచ్చు.
ఒకవేళ సొంతంగా ఎన్ఎఫ్టీ కలెక్షన్‌ను స్టార్ట్ చేయాలని అనుకుంటే.. దాని కోసం క్రిప్టోకరెన్సీ ఉన్న డిజిటల్ వాలెట్ ఉండాలి. ఎందుకంటే.. ఎన్ఎఫ్టీలలో లావాదేవీలు అన్నీ క్రిప్టోకరెన్సీ ద్వారానే జరుగుతుంటాయి. మనం వాడే కరెన్సీతో క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేసి.. ఆ తర్వాత ఎన్ఎఫ్టీ మార్కెట్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
ఎన్ఎఫ్టీలను లిస్ట్ చేయడం ద్వారా.. వాటిని అమ్మడం ద్వారా.. లేదా.. ఇతర ఎన్ఎఫ్టీలను కొనుగోలు చేసి వాటిని తిరిగి బిడ్‌లో పెట్టి.. ఎన్ఎఫ్టీ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఇది కూడా ఒక రకంగా క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ కిందికే వస్తుంది.
Read More : NFT | సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్న ఎన్ఎఫ్టీ.. అసలు ఏంటది?”
“దేనికీ పనికిరాని ట్రాష్ క్యాన్‌ను ఎన్ఎఫ్టీలో 2 కోట్లకు అమ్మేశాడు.. ఎక్కడో తెలుసా?”
“ఈ డిజిటల్ ఫొటోకు వేలంలో రూ.501 కోట్లు.. ఎందుకో తెలుసా?”
డిజాస్టర్ గర్ల్‌గా పాపులర్.. 5 లక్షల డాలర్లకు అమ్ముడుపోయిన మీమ్”