vivo Y400 Pro 5G | భారీ బ్యాటరీ కెపాసిటీ ఉండడంతోపాటు వేగంగా చార్జింగ్ అయ్యేలా కంపెనీలు ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందజేస్తున్నాయి. అందులో భాగంగానే భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ కలిగిన ఫోన్లను మార్కెట్లో ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు. వినియోగదారులకు కూడా ఇలాంటి ఫోన్లకు గాను ఎక్కువ స్పందన లభిస్తోంది. ఇక ఇదే కోవలో లేటెస్ట్గా వివో కూడా ఓ భారీ బ్యాటరీ కెపాసిటీ కలిగిన స్మార్ట్ ఫోన్‌ను భారత్ లో లాంచ్ చేసింది. వై400 ప్రొ 5జి పేరిట వివో లాంచ్ చేసిన ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను కూడా అందిస్తున్నారు. ఇందులో 6.77 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. సూర్యకాంతిలోనూ ఫోన్ తెర స్పష్టంగా కనిపించేలా 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను ఈ ఫోన్లో అందిస్తున్నారు.
ఈ ఫోన్లో ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. అదనంగా మరో 8జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 2 మెగాపిక్సల్ పోర్ట్రెయిట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల సహాయంతో 4కె వీడియోలను అద్భుతంగా చిత్రీకరించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఇక ఇందులో ఐపీ65 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 లభిస్తుంది. 5500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఏకంగా 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను 19 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్ 8జీబీ ర్యామ్‌తోపాటు 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ అయింది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. యూఎస్బీ టైప్ సి ఆడియోకు సపోర్ట్ లభిస్తుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ 5.4 లభిస్తుంది. యూఎస్బీ టైప్ సి పోర్టు ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు.
వివో వై400 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్ ఫ్రీ స్టైల్ వైట్, ఫెస్ట్ గోల్డ్, నెబులా పర్పుల్ కలర్ మోడల్స్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతోపాటు వివో ఇండియా ఆన్లైన్ స్టోర్‌లో, అన్ని ప్రధాన ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు. జూన్ 27వ తేదీ నుంచి ఈ ఫోన్ లభిస్తుంది. లాంచింగ్ కింద పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఎస్బీఐ, డీబీఎస్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ కార్డులతో ఈ ఫోన్‌పై 10 శాతం క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. జీరో డౌన్ పేమెంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 1 ఏడాది పాటు ఉచిత ఎక్స్టెండెడ్ వారంటీని అందిస్తున్నారు.