Vivo Y11 : బడ్జెట్ రేంజ్ ఫోన్లపై ఎక్కువ ఫోకస్ చేసే చైనా మొబైల్ సంస్థ వివో తాజాగా రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వివో వై11, వివో వై21 పేరుతో రెండు కొత్త ఫోన్లను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇవి రెండూ 5జీ ఫోన్లు. 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, డిమెన్సిటీ 6300 చిప్సెట్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. వీటిలోని ప్రధాన ఫీచర్లివి.
వివో వై11 5జీ
మిడ్ నైట్ బ్లూ, సన్‌రైజ్ గోల్డ్ కలర్స్‌లో లభ్యం. 6.74 అంగుళాల హెచ్డి+ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డిమెన్సిటీ 6,300 చిప్సెట్, 13 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, ఒరిజిన్ ఓఎస్ 6, వెట్ హ్యాండ్ టచ్, గ్లాసీ హ్యాండ్ టచ్, ఐపీ 65 రేటింగ్, 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వంటి ఫీచర్లున్నాయి. వీటి ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.14,999 / రూ.16,999
వివో వై21 5జీ
మిడ్ నైట్ బ్లూ, షాంపేన్ గోల్డ్ కలర్స్‌లో లభ్యం. 6.74 అంగుళాల హెచ్డి+ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డిమెన్సిటీ 6,300 చిప్సెట్, 50 ఎంపీ మెయిన్ కెమెరా+సెకెండరీ లెన్స్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, ఒరిజిన్ ఓఎస్ 6, వెట్ హ్యాండ్ టచ్, గ్లాసీ హ్యాండ్ టచ్, ఐపీ 65 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ డ్యురబిలిటీ, ఎలిగెంట్ డిజైన్, 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వంటి ఫీచర్లున్నాయి. వీటి ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.18,999 / రూ.20,999 / రూ.22,999. ఈ ఫోన్లు ఆన్లైన్లో సేల్కు అందుబాటులో ఉన్నాయి.