న్యూఢిల్లీ : వివో X90 సిరీస్ మార్కెట్లోకి త్వరలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. నవంబర్ 22న చైనాలో X90 సిరీస్‌ను లాంఛ్ చేయనున్నట్టు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వెల్లడించగా గ్లోబల్ లాంఛ్‌పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. వివో కెమెరా ఫోకస్డ్ ఎక్స్80 సిరీస్ కొనసాగింపుగా ఎక్స్90 సిరీస్‌ను వివో ముందుకుతెచ్చింది.
వివో ఎక్స్90 సిరీస్ మెరుగైన కెమెరా స్పెసిఫికేషన్స్, పవర్ఫుల్ ఇంటీరియర్స్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. వివో ఎక్స్90 సిరీస్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఇవేనంటూ టెక్ నిపుణులు ఇషాన్ అగర్వాల్ పూర్తి సమాచారాన్ని ప్రైస్బాబాతో పంచుకున్నారు. వివో ఎక్స్90 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్90, వివో ఎక్స్90ప్రొ, వివో ఎక్స్90ప్రొ , వివోఎక్స్90 ప్రొ ప్లస్ వంటి మూడు ఫోన్లను విడుదల చేస్తోంది. వివో ఎక్స్90 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌ను కలిగిఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ ఓఎస్3పై రన్ అవుతుంది. ఇక వివో ఎక్స్90 ప్రొ 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో, 9200 చిప్సెట్తో కస్లమర్ల ముందుకు రానున్న వివో ఎక్స్90 ప్రొ వివో ఎక్స్90 ప్రొ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. మరోవైపు వివో ఎక్స్90 ప్రొ+ 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో డైమెన్షరీ 9200 చిప్సెట్తో ఈ స్మార్ట్‌పోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ ఓఎస్3పై రన్ అవుతుంది. ఇక ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానున్న ఈ ప్రీమియం ఫోన్ 4700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 50డబ్ల్యూ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది.