Vivo T2 Series | చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో.. భారత్ మార్కెట్లో మంగళవారం రెండు `టీ2` 5జీ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించనున్నది. ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఫోన్లకు వివో టీ2 5జీ సిరీస్ అని పేర్లు పెట్టినట్లు తెలుస్తున్నది. అధికారికంగా వాటి పేర్లు, స్పెషిఫికేషన్లు, డిజైన్, ఫీచర్లు ఇంకా వెల్లడించలేదు.
మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వివో ఆవిష్కరించే రెండు ఫోన్లకు వివో టీ2 5జీ, వివో టీ2ఎక్స్ 5జీ అని పేరు పెడుతుందని సమాచారం. వివో టీ1 సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా వీటిని మార్కెట్లోకి తెస్తున్నట్లు తెలుస్తున్నది. వివో టీ2 5జీ ఫోన్లలో అమోల్డ్ డిస్ప్లే విత్ ఫుల్ హెచ్డీ + రిజొల్యూషన్ ఉండొచ్చునని అంచనా. 6జీబీ / 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా ఉండనున్నది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తున్నట్లు సమాచారం.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తోపాటు 65-మెగా పిక్సెల్ కెమెరా, డెప్త్ ఆర్ మాక్రో సెన్సర్ కెమెరా కూడా ఉండవచ్చు. మీడియాలో కథనాలను బట్టి వివో టీ2ఎక్స్ 5జీ ఫోన్.. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ కూడా అమర్చవచ్చునని భావిస్తున్నారు. ఇక ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే విత్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్‌తో వస్తుంది. వివో టీ2 సిరీస్ 5జీ ఫోన్లు రూ.20 వేల లోపు ధరకే అందుబాటులో ఉండొచ్చునని తెలుస్తున్నది. వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ ఫోన్‌తో వివో టీ2 సిరీస్ ఫోన్లు పోటీ పడతాయని భావిస్తున్నారు.