vivo T4 Ultra | మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలో పోటీలు పడి మరీ ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందజేస్తున్నాయి. వీటిల్లో ఫ్లాగ్ షిప్ ఫోన్లలాంటి ఫీచర్లను అందిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఇదే సెజిమెంట్లో వివో మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వివో టి4 అల్ట్రా పేరిట రిలీజ్ అయిన ఈ ఫోన్లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. టి4 సిరీస్‌లో విడుదలైన లేటెస్ట్ ఫోన్ ఇదే కాగా ఇందులో 6.78 ఇంచుల క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కనుక ఫోన్ డిస్ ప్లే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా క్వాలిటీ కలిగిన దృశ్యాలను ఈ తెరపై వీక్షించవచ్చు. ఈ ఫోన్ సూర్యకాంతిలో 5000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ వరకు సపోర్ట్ చేస్తుండడం విశేషం. ఇక ముందు భాగంలో 32 మెగాపిక్సల్ ఆటోఫోకస్ పంచ్ హోల్ కెమెరాను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను అమర్చారు. 12జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. 512జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఫోన్లో లభిస్తుంది. ఈ ఫోన్‌కు గాను 3 ఆండ్రాయిడ్ అప్డేట్స్ను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. అలాగే ఏఐ ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. సర్కిల్ టు సెర్చ్, లైవ్ కాల్ ట్రాన్స్లేషన్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, ఎరేజ్ 2.0 వంటి ఏఐ ఫీచర్లు ఈ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను, 50 మెగాపిక్సల్ 3ఎక్స్ టెలిఫొటో కెమెరాను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోటోలు, వీడియోలను అద్భుతంగా చిత్రీకరించుకోవచ్చు. ఈ ఫోన్లో 5500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా దీనికి 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు ఐపీ64 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా లభిస్తోంది.
వివో టి4 అల్ట్రా స్మార్ట్ ఫోన్లో 8జీబీ, 12జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ వేరియెంట్లు లభిస్తున్నాయి. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఇచ్చారు. యూఎస్బీ టైప్ సి, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి.
వివో టి4 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ను ఫీనిక్స్ గోల్డ్, మీటియర్ గ్రే కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.37,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.39,999, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ ధర రూ.41,999గా ఉంది. ఈ ఫోన్లను వివో ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్ లైన్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. జూన్ 18 నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై హెచ్ఎస్బీసీ లేదా ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డులతో రూ.3000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. రూ.5000 ఎక్స్చేంజ్ బోనస్‌ను కూడా ఇస్తున్నారు. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.