న్యూఢిల్లీ : భారత్‌లో ఇటీవల లాంఛ్ అయిన వివో ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్ వివో టీ1ఎక్స్ సేల్ బుధవారం నుంచి ప్రారంభమైంది. చైనాలో ఇప్పటికే లాంఛ్ అయిన వివో టీ1ఎక్స్ కంటే భారత్‌లో వేరియంట్ భిన్నమైనది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం వంటి పీచర్లతో వివో టీ1ఎక్స్ అందుబాటులో ఉంది.
ప్రీమియం, మిడ్ రేంజ్ ఫోన్లను ప్రవేశపెట్టిన అనంతరం వివో ఎంట్రీ లెవెల్ కస్టమర్లు, బడ్జెట్ ఫోన్ల కొనుగోలుదారుల కోసం టీ1ఎక్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పలు హాట్ ఫీచర్లతో పాటు మెరుగైన ఎంట్రీ లెవెల్ ఫోన్ కోసం చూసేవారికి వివో టీ1ఎక్స్ సరైన డివైజ్‌గా టెక్ నిపుణులు చెబుతున్నారు.
వివో టీ1ఎక్స్ మోడల్‌ను బట్టి రూ 11,999 నుంచి రూ 14,999 వరకూ అందుబాటులో ఉంది. వివో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రారంభ ఆఫర్ కింద హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై వివో రూ 1000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇక వివో టీ1ఎక్స్ 6.58 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెడ్+ రిజల్యూషన్‌తో కస్టమర్లను ఆకట్టకుంటుంది. వివో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌ను కలిగిఉంది.