Moon | చంద్రుడిపై ఆక్సిజన్ తయారీ.. యూకే కంపెనీకి అవకాశం!
చందమామపై మనుషులు నివసించేలా చేయాలని చాలా కాలంగా పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై ఆక్సిజన్ తయారు చేయాలని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఎప్పటి నుంచో అనుకుంటోంది. ఈ అవకాశం కోసం పలు కంపెనీలు పోటీ పడ్డాయి.
తాజాగా ఈ అవకాశం యూకేకు చెందిన థేల్స్ అలీనియా స్పేస్ కంపెనీ నేతృత్వంలోని బృందానికి దక్కినట్లు ఈఎస్ఏ వెల్లడించింది. చంద్రుడిపై ఆక్సిజన్ తయారు చేసే ఒక ప్రోటోటైప్ మెషీన్ తయారు చేసే పనిని ఈ బృందానికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఈ యంత్రం సోలార్ ఎనర్జీతో నడిచేలా రూపొందించనున్నారు.
దీనిద్వారా ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ను చంద్రుడిపై ప్రొపెల్లెంట్లా, అలాగే వ్యోమగాములు ఊపిరి తీసుకునేందుకు ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. చంద్రుడి నేల నుంచి కనీసం 50 నుంచి 100 గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం ఈ యంత్రం లక్ష్యంగా నిర్దేశించారు. ఈఎస్ఏ ఇచ్చిన శాంపిల్ నుంచి 70 శాతం ఆక్సిజన్‌ను ఈ యంత్రం బయటకు తీయాల్సి ఉంటుందట.

ఈ ప్రక్రియ మొత్తం పదిరోజుల్లోనే పూర్తవ్వాలని కూడా ఈఎస్ఏ షరతు విధించింది. ఎందుకంటే చంద్రుడిపై పదిరోజులే సూర్యుడు కనిపిస్తాడు. ఆ తర్వాత అత్యంత చీకటి, చలిగా ఉండే రాత్రి మొదలవుతుంది. వివిధ లూనార్ ల్యాండర్స్లో ప్రయాణించే విధంగా తక్కువ శక్తిని వినియోగించుకునేదిగా ఉండాలని ఈఎస్ఏ తెలిపింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

