ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌కు భారీ షాక్ తగిలింది. తొలుత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొంటానని ప్రకటించి వెనక్కు తగ్గాడు ఎలన్‌మస్క్. కానీ ఆ ఎలన్‌మస్క్‌కే ట్విట్టర్ వాటాదారులు గట్టి షాక్ ఇచ్చారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్‌కు విక్రయించేందుకు ఆ సంస్థ వాటాదారుల సమావేశం మంగళవారం ఆమోదం తెలిపింది.
ప్రపంచ కుబేరుడైన ఎలన్‌మస్క్.. 20 శాతం వరకు స్పామ్ ఖాతాలు ఉన్నాయనే సాకుతో ట్విట్టర్ డీల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎలన్‌మస్క్ తీరుపై ట్విట్టర్ యాజమాన్యం.. ట్విట్టర్‌పై ఎలన్‌మస్క్ పరస్పరం న్యాయ పోరాటానికి దిగారు. ఈ నేపథ్యంలో మస్క్ డీల్‌కు ట్విట్టర్ వాటాదారుల సమావేశం ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకున్నది.