Twitter – H-1B | ట్విట్టరీలకు వీసా కష్టాలు.. గ్రేస్ పీరియడ్ దాటితే యూఎస్ వీడాల్సిందేనా?!
Twitter - H-1B | ట్విట్టర్లో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 8శాతం విదేశీయులు హెచ్-బీ-1, ఎల్-1 వీసాదారులు. 60 రోజులు దాటితే ఎల్-1 వీసాదారులు అమెరికాను వీడాల్సిందే.
Twitter – H-1B | ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుడు ఎలన్‌మస్క్.. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను టేకోవర్ చేయగానే సంస్థలోని 7,500 మంది ఉద్యోగుల్లో సగం మందికి ఉద్వాసన పలికారు. ఎలన్‌మస్క్ తీసుకున్న నిర్ణయంతో నిపుణులు ఉద్యోగాలు కోల్పోవడమే కాదు.. వారి ఇమ్మిగ్రేషన్ స్టేటస్ కూడా సందేహంలో చిక్కుకుంది.
అమెరికాలో వర్క్ వీసాపై పని చేస్తున్న వారంతా యూఎస్ హెచ్-1 బీ వీసా కింద పని చేస్తున్నారు. అంతే కాదు హెచ్-1 బీ వీసాతోపాటు ఎల్-1 వీసాలపై పని చేస్తున్న వారు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతే కొత్త ఉద్యోగాన్ని సంపాదించుకోవాలంటే 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ గ్రేస్ పీరియడ్ ముగిసేలోపు కొత్త సంస్థలో ఉద్యోగం పొందడమో, అమెరికాను వీడటమో చేయాల్సిందే.
ట్విట్టర్లో పని చేస్తున్న వారిలో 625 నుంచి 670 మంది హెచ్-1 బీ వీసా హోల్డర్లు ఉన్నారు. ట్విట్టర్ వర్క్‌ఫోర్స్‌లో హెచ్-1 బీ వీసాదారుల్లో సుమారు ఎనిమిది శాతం మంది ఉంటారని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ అనాలసిస్ ఆఫ్ యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేసన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) డేటా చెబుతున్నది. ట్విట్టర్లో ఉద్వాసనకు గురైన వారిలో దాదాపు సగం మంది ఉండగా, వారిలో విదేశీ వర్కర్లు ఎంత మంది అన్న సంగతి తెలియదని ఇమ్మిగ్రేషన్ వర్గాలు తెలిపాయి.ట్విట్టర్లో పని చేస్తున్న హెచ్1 వీసాదారులకు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది.
హెచ్1బీ వీసా లాటరీలో ఎంపికైన వారు తదుపరి లాటరీ ప్రక్రియ వరకు వేచి ఉండొచ్చు. వారు పని చేస్తున్న సంస్థ నుంచి ఉద్వాసనకు గురైతే.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ ముగిశాక స్వదేశానికి వెళ్లాల్సిందేనని, వారి సొంత గడ్డపై నుంచి అమెరికాలో ఉద్యోగాలు వెతుక్కోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అలా ఉద్యోగాలు పొందిన వారిని అమెరికాకు వచ్చేందుకు అనుమతించాలని సంబంధిత సంస్థ యాజమాన్యం ఇమ్మిగ్రేషన్ విభాగం ముందు పిటిషన్ దాఖలు చేయొచ్చు. ఇమ్మిగ్రేషన్ విభాగం వీసాకు ఆమోదం తెలిపిన తర్వాత వారు యూఎస్‌కు తిరిగి రావచ్చు.
హెచ్ 1-బీ వీసా దారులకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంది.. కానీ ఎల్-1, ఒ-1 వీసాలసై పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రం కష్టాలు మొదలవుతాయి. వారు ఉద్యోగం కోల్పోయిన వెంటనే దేశాన్ని వీడాల్సిందేనని తేల్చి చెప్పారు లాక్వెస్ట్ మేనేజింగ్ పార్టనర్ పూర్వీ ఛోతానీ చెప్పారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Business news
- H-1B Visa
- L-1
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

